Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

Phani CH

|

Updated on: Feb 17, 2025 | 7:41 PM

పాములంటే భయపడనివారుండరు. పాము పేరు చెబితేనే కొందరు ఆమడదూరం పరుగెడతారు. అలాంటిది పాము తమ ఇంట్లోనే ప్రత్యక్షమైతే ఇక వాళ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఇటీవల పాములు ఎక్కడపడితే అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇళ్లలో, వాహనాల్లోకి చొరబడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

ఒక్కోసారి పాము మనుషులపై దాడి చేసి కాటువేస్తున్న ఘటనలూ చూశాం. పాము కాటు వేసేటప్పుడు విషాన్ని ఎలా విడుదల చేస్తుందో ఎప్పుడైనా చూశారా? పాము విషాన్ని విడుదల చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ ఇంట్లోకి దూరిన పాము అక్కడ రాళ్ల మధ్యలోంచి గోడలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఆ పామును గమనించి ఆ యింటి యజమాని దాన్ని అక్కడినుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు. రకరకాలుగా బెదిరించాడు. కానీ ఆ పాము అక్కడినుంచి కదల్లేదు. చివరికి ఓ చెప్పు తీసుకొని పాముని కదిలించాడు. అంతే పాము ఆగ్రహంతో రెచ్చిపోయింది. అతనిపై దాడి చేసింది. చెప్పును కాటేసింది. అలా చెప్పును చాలాసేపు కాటువేస్తూ విషాన్ని విడుదల చేసింది. అదే కాటు ఆ వ్యక్తి చేతిని వేసి ఉంటే అతని పరిస్థితి ఏమయ్యుండేదో అర్ధం చేసుకోవచ్చు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. వీడియోపై రకరకాలుగా స్పందించారు. ఇంత విషం శరీరంలోకి వెళ్తే పరిస్థితి ఏంటో అంటూ కొందరు, పాములకు మనం హాని చేయకుండా ఉంటే అవి మనకి ఎలాంటి హానీ చేయవు అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను దాదాపు 4 లక్షలమంది వీక్షించారు. వేలాదిమంది లైక్‌ చేసి షేర్‌ చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లివేదికపై రెండు జంటలూ ఒకేలా.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది

బ్రెయిన్‌ ఉన్నవాళ్లే ఈ ట్యాప్ తిప్పగలరు! మీకు ఉందో లేదో చెక్ చేసుకోండి