భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్.. చూస్తే మతిపోతుంది
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు.. ప్రేమికులు తమ ప్రేమ కలకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తూ వారం రోజులు ముందునుంచే ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతూ రకరకాల బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. ప్రేమను తెలియచేయడంలో ముందు నిలిచేది హార్ట్ సింబల్. ఇది వారిచ్చే ప్రతీ బహుమతిపైనా ప్రత్యేకంగా కనిపిస్తూ వారి ప్రేమను చాటుతుంది.
కొందరు ఖరీదైన బహుమతులు ఇస్తే కొందరు మాత్రం తమ చిన్న బహుమతులనే ఇస్తూ.. ప్రేమకు వెలకట్టలేమని చాటిచెబుతారు. అలా ఓ మహిళ తన భర్తపై ఉన్న ప్రేమను వినూత్నంగా చాటుకుంది. వాలెంటైన్స్ డే అనేది కేవలం ప్రేమించుకుంటున్న వారికి మాత్రమే కాదు..పెళ్లైన దంపతులకు కూడా ప్రత్యేకమే. భార్యభర్తలుగా మారిన ప్రేమికులు పెళ్లి తర్వాత కూడా అంతే ప్రేమగా ఉంటారని చెప్పేందుకు ఉదాహరణే ఈ వీడియో. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఆ మహిళపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీడియోలో ఒక మహిళ తన భర్త కోసం వెరైటీగా చపాతీలు తయారు చేసింది. తన ప్రేమనంతా రంగరించి భర్తకోసం వెరైటీగా రోటీలు తయారుచేసింది. వాటిని తన భర్తకు వడ్డిస్తూ..వాలెంటైన్స్ డే సందర్భంగా తన ప్రేమను తెలియజేసింది. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే ఎరుపు రంగులో ఒక చపాతీ, గ్రీన్ కలర్‌లో మరో చపాతీ తయారుచేసి వాటి మధ్యలో హార్ట్ సింబల్ ఆకారంలో చిన్న చపాతీ ముక్కలు అతికించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?
పెళ్లివేదికపై రెండు జంటలూ ఒకేలా.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
బ్రెయిన్ ఉన్నవాళ్లే ఈ ట్యాప్ తిప్పగలరు! మీకు ఉందో లేదో చెక్ చేసుకోండి