అబ్బా.. కరోనా వైరస్ పై ఎట్టకేలకు నోరు విప్పిన చైనా..
ప్రపంచాన్ని వణికించిన కొవిడ్-19 మూలాలపై మూడేళ్లయినా ఇంకా మిస్టరీ తొలగలేదు. చైనాలోని వుహాన్‌లో బయటపడిన ఈ వైరస్‌కు సంబంధించిన మూలాలపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నా ఫలితం మాత్రం తేలలేదు. కొవిడ్ మానవ నిర్మిత వైరసే అంటూ గతంలో ప్రముఖ అమెరికన్ ఎపిడమాలజిస్ట్ సంచలన ప్రకటన చేశారు.
గతంలో వుహాన్ ల్యాబ్‌లో పనిచేసిన ఆయన.. అక్కడి నుంచే వైరస్ లీకయ్యిందంటూ బాంబు పేల్చారు. చైనా తాజాగా స్పందిస్తూ వుహాన్ ల్యాబ్‌లో కరోనా వైరస్ జన్యుమార్పిడి పరిశోధనలు నిర్వహించలేదని స్పష్టం చేసింది. సాంక్రమిక వ్యాధుల పరిశోధనల కోసం అమెరికా ఆర్థిక సాయం చేసిందని ఆరోపణలు రావడంతో చైనా ఈ విధంగా స్పందించింది. వూహాన్ ఇన్‌స్టిట్యూట్‌లో కరోనా వైరస్‌పై గెయిన్-ఆఫ్-ఫంక్షన్ స్టడీస్ ఎప్పుడూ నిర్వహించలేదనీ ఈ విషయాన్ని అనేకసార్లు స్పష్టం చేశామనీ చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ అన్నారు. కొవిడ్-19ను తాము రూపొందించలేదు, వృద్ధి చేయలేదు, లీక్ చేయలేదన్నారు. వైరస్ మూలాలను కనుక్కోవడంపై వస్తోన్న అన్ని రకాల రాజకీయ ఆరోపణలను వ్యతిరేకిస్తున్నాం అని తెలిపారు. చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో గెయిన్-ఆఫ్-ఫంక్షన్ అధ్యయనం కోసం యుఎస్‌ఎయిడ్ సాయం చేసిందని అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ఎయిడ్ కరోనా మహమ్మారికి కారణమవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి దారితీసిందన్న విమర్శలొచ్చాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా
పీఎఫ్ పై వడ్డీ మరింత తగ్గనుందా?? ఫిబ్రవరి 28 సమావేశంలో నిర్ణయం
కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు
ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..
భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్.. చూస్తే మతిపోతుంది

బీచ్‌లో ‘బ్లడ్ రెయిన్’.. వీడియో వైరల్

నగరంలో భలే దొంగలు.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్

విద్యార్ధులు అల్లరి తట్టుకోలేక.. గుంజీలు తీసిన మాస్టారు..!

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది
