Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2023లో భూమికి అంతం తప్పదా.. నాసా ఏం చెప్పిందంటే? వీడియో

2023లో భూమికి అంతం తప్పదా.. నాసా ఏం చెప్పిందంటే? వీడియో

Samatha J

|

Updated on: Feb 18, 2025 | 1:30 PM

నాసా 2032 డిసెంబర్‌లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్న 300 అడుగుల వ్యాసార్థం గల గ్రహశకలం గురించి హెచ్చరించింది. 2024 YR14 అని పేరు పెట్టబడిన ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే సంభావ్యత 2.3% మాత్రమే అని నాసా పేర్కొంది. అయితే, ఈ తక్కువ సంభావ్యత ఉన్నప్పటికీ, నాసా గ్రహశకలం కక్షను పరిశీలిస్తూ, దాని కక్షను మార్చడానికి ప్రయత్నాలు చేస్తోంది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ 2025 మార్చిలో గ్రహశకలం పరిమాణాన్ని ఖచ్చితంగా అంచనా వేయడానికి పరిశీలిస్తుంది. గ్రహశకలం భూమిని ఢీకొంటే తీవ్రమైన నష్టం సంభవించే అవకాశం ఉంది, కానీ నాసా శాస్త్రవేత్తలు దానిని పక్కకు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు. భూమిపై ఏ ప్రాంతాన్ని ఢీకొడుతుందో ఇంకా అంచనా వేయబడలేదు.

భూగోళానికి 2032 చివరి సంవత్సరమా? నాసా ఎందుకు అలా చెబుతుంది? అంతరిక్షం నుంచి భూమికి మరో ముప్పు ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధన అంచనా వేస్తుంది. ఓ భారీ గ్రహశకలం భూమికి ఢీకొట్టేందుకు వాయువేగంతో దూసుకు వస్తుందని చెప్పింది. ఆ గ్రహశకలం ఎప్పుడు వచ్చేది కూడా డేట్ తో సహా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కాకపోతే అది భూమిపై ఏ ప్రాంతాన్ని ఢీకొడుతుందో అనే విషయాన్ని మాత్రం శాస్త్రవేత్తలు ఇంకా అంచనా వేయలేదు. మరి 2032లో ఏం జరగబోతుంది?ఓ భారీ గ్రహశకలం భూమివైపు దూసుకొస్తుందని 2032 డిసెంబర్ లో అది భూమిని ఢీకొనే ఛాన్స్ ఉందని నాసా వెల్లడించింది. 300 ఫీట్ల వ్యాసార్థంతో ఉన్న గ్రహశకలం చాలా వేగంగా భూమిని ఢీకొట్టేందుకు వస్తోంది. అయితే అది భూమిని ఢీకొనే అవకాశం చాలా తక్కువని పేర్కొంది. ఆ గ్రహశకలానికి 2024 వైఆర్14గా శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. దీన్ని కొన్ని వారాల క్రితమే కనిపెట్టారు. అయితే భూమిని ఢీకొట్టే ఛాన్స్ 2.3% ఉంటుందని అది కూడా సరిగ్గా 2032 డిసెంబర్ 22వ తేదీన జరగొచ్చని నాసా అంచనా వేస్తోంది. అయితే ఇప్పటికే నాసా ఆ గ్రహశకలం కక్షను పరిశీలిస్తోంది. అది భూమిని ఢీకొనకుండా దాని కక్షను దారి మళ్ళించే ప్రయత్నాలు చేస్తోంది. నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కూడా మార్చి 2025లో ఆ గ్రహశకలాన్ని పరిశీలించి దాని పరిమాణాన్ని బాగా అంచనా వేసే పనిలో ఉంది.

మరిన్ని వీడియోల కోసం :

ఆ టైంలో సూసైడ్‌ చేసుకోవాలనుకున్నా..స్టార్ నటి షాకింగ్ కామెంట్స్ వీడియో

బస్సులో మొబైల్‌లో మునిగిపోయిన ప్రయాణికులు.. అలికిడి విని పైకి చూడగానే షాక్‌!

అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా.? తస్మాత్ జాగ్రత్త!

గుండెపోటు బాధితుడికి సీపీఆర్.. కళ్లు తెరిచాక ఆ వ్యక్తి అన్న మాటలకు అంతా షాక్