పీఎఫ్ పై వడ్డీ మరింత తగ్గనుందా?? ఫిబ్రవరి 28 సమావేశంలో నిర్ణయం
ఈ ఆర్థిక సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగుస్తుంది. ఈ సమయంలో పీఎఫ్ వడ్డీ రేటుపై చర్చ నడుస్తోంది. ఈసారి ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8 శాతం ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. ఇప్పుడు దాని కంటే కాస్త తక్కువగా 8 శాతం ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇక ఈ వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫిబ్రవరి 28న సమావేశం అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఇన్వెస్ట్‌మెంట్లపై మంచి రిటర్న్స్ అందుకుంది ప్రభుత్వం. సబ్‌స్క్రైబర్స్ సంఖ్య పెరిగింది. క్లెయిమ్ సెటిల్మెంట్‌లు గణనీయంగా పెరిగినా.. వడ్డీ రేటు పెద్దగా పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సంలో రూ.1.82 లక్షల కోట్ల విలువైన 44.5 మిలియన్ క్లెయిమ్స్ సెటిల్ చేయగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో అది రూ. 2.05 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తం 50.8 మిలియన్ క్లెయిమ్స్ సెటిల్ చేసింది ఈపీఎఫ్ఓ. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ కు 65 మిలియన్లకుపైగా చందాదారులు ఉన్నారు. పీఎఫ్ వడ్డీ రేట్లు గతంలో కంటే ఇప్పుడు చాలా తగ్గాయి. 1952-53లో 3 శాతంగా ఉండగా.. 1972-73లో 6 శాతంగా ఉండేవి. 1992-93 సమయంలో ఏకంగా 12 శాతం వడ్డీ రేటు ఉండగా.. అక్కడి నుంచి తగ్గుతూ వచ్చింది. 2022-23లో ఇది 8.15 శాతానికి చేరింది. ప్రస్తుతం 8.25 శాతంగా ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు
ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..
భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్.. చూస్తే మతిపోతుంది
పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?
పెళ్లివేదికపై రెండు జంటలూ ఒకేలా.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

