Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండిగో బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా 50%..వీడియో

ఇండిగో బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా 50%..వీడియో

Samatha J

|

Updated on: Feb 17, 2025 | 6:58 AM

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. వాలంటైన్స్‌ డే సందర్భంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌ బంపరాఫర్‌ ప్రకటించింది. విమాన టికెట్ల బుకింగ్‌పై 50 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌ ను అనౌన్స్ చేసింది. రెండు టికెట్లు బుక్‌ చేసుకునేవారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. వన్‌ ప్లస్‌ వన్‌ అన్నమాట. ఇక లేటెందుకు.. వాలంటైన్స్‌ డే కి ఎటైనా టూర్‌ ప్లాన్‌ చేసుకుంటే వెంటనే మొబైల్‌ అందుకుని టికెట్స్‌ బుక్‌ చేసేయండిమరి. ఈ నెల 12 నుంచి 16 లోపు టికెట్‌లు బుక్‌ చేసుకోవాలి. బుకింగ్ తేదీకి, జ‌ర్నీ డేట్‌కు మ‌ధ్య క‌నీసం 15 రోజుల వ్యవ‌ధి ఉండాల‌ని ఇండిగో తెలిపింది.

టికెట్ ధ‌ర‌తో పాటు ప్రయాణికులు ట్రావెల్ యాడ్ ఆన్స్‌పైనా డిస్కౌంట్ల‌ను పొంద‌వ‌చ్చని కంపెనీ తెలిపింది. ముందుగా టికెట్లు బుక్‌ చేసుకునేవారికి అద‌న‌పు బ్యాగేజీ పైన కూడా 15 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. సీట్ల ఎంపిక‌పై 15 శాతం, ముంద‌స్తుగా బుక్ చేసే మీల్స్ పై 10 శాతం త‌గ్గింపును ఇస్తామ‌ని ఇండిగో తెలిపింది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌, మొబైల్ యాప్‌, ఇండిగో 6ఈ ఏఐ చాట్‌బాట్‌.. ఎంపిక చేసిన ట్రావెల్ పార్ట్‌న‌ర్స్ వేదిక‌గా టికెట్ బుక్ చేసిన‌ప్పుడు ఈ ఆఫ‌ర్ పొంద‌వ‌చ్చని తెలిపింది. ఫిబ్రవ‌రి 14న‌ ఇండిగో మ‌రో ఫ్లాష్ సేల్ ను అందుబాటులోకి తెస్తుంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌, మొబైల్ యాప్ ద్వారా చేసే తొలి 500 బుకింగ్స్ పై అద‌నంగా 10 శాతం త‌గ్గింపును ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రక‌టించింది. ఈ నెల 14వ తేదీ రాత్రి 8 గంట‌ల నుంచి 11.59 గంటల మ‌ధ్య బుక్‌ చేసుకోవాలని తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం : 

షాపింగ్ చేస్తూ ప్యాంటె పాకెట్లో ఫోన్ పెట్టుకున్న మహిళ.. ఒక్కసారిగా అంతా షాక్ వీడియో

12 అడుగుల గిరి నాగు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. చూసి తీరాల్సిందే!వీడియో

అగ్గిపెట్టె అంత రూమ్.. అద్దె మాత్రం రూ.25 వేలు… ఓ బ్యాచిలర్‌ కష్టాల వీడియో