అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా
కరోనా కాలం నుంచి వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు ప్రపంచం అలవాటు పడిపోయింది. ఆ తర్వాత కంపెనీలు హైబ్రీడ్ విధానానికి మారాయి. రైళ్లు, బస్సులు క్యాబ్‌లలో వెళుతూ ఐటీ ఉద్యోగులు ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తుండటం మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అలా బెంగళూరు కు చెందిన ఓ మహిళ కూడా రోడ్డుపై వెళుతూ దారిలో వర్క్ చేసింది. ఆమె కారు నడుపుతూ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేయడం వివాదానికి దారి తీసింది.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దీనిపై పోలీసులు దృష్టి పెట్టారు. బెంగళూరులోని ఆర్టీ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ కారు డ్రైవ్ చేస్తూనే ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంది. దీన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారి ట్రాఫిక్ పోలీసుల కంట పడింది. దీంతో ఆమెను ట్రాక్ చేసిన పోలీసులు వెయ్యి రూపాయిలు జరిమానా విధించారు. ప్రజల్లో అవేర్‌నెస్ పెంచడం కోసం ఆ మహిళ వీడియోతో పాటు ఆమెను అదుపులోకి తీసుకున్న ఫొటోను ట్రాఫిక్ డీసీపీ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇంటి నుంచి చేసేది. కారు డ్రైవ్ చేస్తూ కాదు’ అని రాసుకొచ్చారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. పోలీసుల చర్యకు అభినందనలు తెలిపారు. మరోవైపు ఆ మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పీఎఫ్ పై వడ్డీ మరింత తగ్గనుందా?? ఫిబ్రవరి 28 సమావేశంలో నిర్ణయం
కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు
ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..
భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్.. చూస్తే మతిపోతుంది