దారుణం కత్తితో పొడిచి, యాసిడ్ పోసిన యువకుడు..వీడియో
రోజు రోజుకీ ఉన్మాదుల్లా మారుతున్నారు యువత. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్‌కౌంటర్లు జరిపినా వీరిలో మార్పు రావడంలేదు. ప్రేమ పేరుతో అమ్మాయిల వెంటపడుతూ వారు కాదంటే వారిపై దాడులకు పాల్పడుతున్నారు. అన్నమయ్య జిల్లాలో మరోసారి అలాంటి ఘటనే జరిగింది. ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన యువకుడు ఆమె కాదనడంతో యాసిడ్ పోసి పారిపోయాడు. ఈ ఘటనపై రాష్ట్రప్రభుత్వం సీరియస్ అయింది. నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది?
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ ప్యారంపల్లెకు చెందిన యువతిపై మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతిపై ముందుగా కత్తితో దాడి చేసిన యువకుడు ఆ తర్వాత ముఖంపై యాసిడ్ పోశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. స్పందించిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణం అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, వచ్చే ఏప్రిల్ 29న బాధితురాలికి వివాహం నిశ్చయించారు. ఇంతలో ఎంత ఘోరం జరిగిదంటూ ఆ యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నా..స్టార్ నటి షాకింగ్ కామెంట్స్ వీడియో
బస్సులో మొబైల్‌లో మునిగిపోయిన ప్రయాణికులు.. అలికిడి విని పైకి చూడగానే షాక్!
అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా.? తస్మాత్ జాగ్రత్త!
గుండెపోటు బాధితుడికి సీపీఆర్.. కళ్లు తెరిచాక ఆ వ్యక్తి అన్న మాటలకు అంతా షాక్

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
