ఎగురుతూ వచ్చి బొక్కబోర్ల పడ్డ పక్షి.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న వీడియో.. ఎలాగో మీరు చూడండి..

స్మార్ట్ ఫోన్ కాలంలో ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నెట్టింట్లో ఎన్నో తమాషా వీడియోలు నవ్వులు కురిపిస్తుంటాయి.

ఎగురుతూ వచ్చి బొక్కబోర్ల పడ్డ పక్షి.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న వీడియో.. ఎలాగో మీరు చూడండి..
Albatross
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 14, 2021 | 12:18 PM

స్మార్ట్ ఫోన్ కాలంలో ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నెట్టింట్లో ఎన్నో తమాషా వీడియోలు నవ్వులు కురిపిస్తుంటాయి. అందులో మరీ ముఖ్యంగా జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోల జాబితా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  జంతువులు, పక్షులు చేసే చిన్న చిన్న పనులను చూస్తుంటే పెదలపై నవ్వులు రాకమానదు.  జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు ఇప్పటీకే నెట్టింట్లో బోలెడన్నీ దర్శనమిస్తుంటాయి.   తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో ఓ అల్బాట్రాస్ పక్షి ఆకాశం నుంచి వేగంగా ఎగురుతూ వస్తూ.. భూమిపై ల్యాండ్ అవడానికి వచ్చింది. తీరా అది ల్యాండ్ అయ్యే సమయంలో చిన్న పొరపాటు జరిగి.. బొక్కబోర్ల పడింది. పాపం అది తిరిగి సరిగ్గా లేచి నడవడానికి చేసిన ప్రయత్నం చూస్తుంటే నవ్వులు కురిపిస్తుంది. ఈ వీడియోను రాయల్ అల్బాట్రాస్ కమ్ అనే ట్విట్టర్ ఖాతా షేర్ చేయగా.. ఇప్పటివరుక 14 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

Also Read:

సెల్ఫీ వీడియో కోసం ట్రై చేసిన యువతి.. ఓ ఆటాడుకున్న పొట్టేలు… నవ్వులు పూయిస్తున్న వీడియో..

Video: ఆకలి కోసం చిరుత హైనాల ఆరాటం.. రెండింటికి మధ్య జింక పిల్ల పోరాటం.. అంతలో అదిరిపోయే ట్విస్ట్.!

Fitbit Band: మీ చిన్నారుల ఆరోగ్యంపై ఇలా కన్నేసి ఉంచొచ్చు.. మార్కెట్లోకి సరికొత్త ఫిట్‌నెస్‌ బ్యాండ్‌.