Viral Video: దుర్గామాత నిమజ్జనంలో హీరోగా మారిన బుడతడు.. ఎస్సైని ప్రశ్నించిన ఆరేళ్ల బుడ్డొడు.. వీడియో వైరల్..!
Viral Video: కొంత మంది చిన్నారులు మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తుంటుంది. తెలిసి తెలియన వయసులో కూడా వారి మాట తీరు అందరిని ఆకట్టుకునేలా..
Viral Video: కొంత మంది చిన్నారులు మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తుంటుంది. తెలిసి తెలియన వయసులో కూడా వారి మాట తీరు అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. వాళ్లకన్న పెద్దవారితో ఏ మాత్రం భయపడకుండా మాట్లాడుతుంటారు. ఇలాంటి ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో చోటు చేసుకుంది. పట్టణంలో దుర్గామాత నిమజ్జనం కార్యక్రమాల్లో ఓ బుడ్డోడు హీరోగా మారాడు. అయితే దుర్గామాత ఊరేగింపు కార్యక్రమం సందర్భంగా డీజే మోగడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. బీజే సౌండ్‌ను పెట్టవద్దని నిర్వహకులకు సూచించారు. ఈ సందర్భంగా ఓ బుడ్డొడు ఎస్సైతో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డీజే సౌండ్ పెట్టవద్దని ఎస్సై చెబుతుంటే అక్కడే ఉన్న ఓ బుడతడు డీజే ఎందుకు పెట్టొద్దు సార్.. మా దుర్గమ్మ వారి ఊరేగింపుకు డీజే ఎందుకు పెట్టోద్దు అంటూ స్థానిక ఎస్సైని ప్రశ్నించాడు. ఆ బుడ్డొడి వయసు 6 సంవత్సరాలు. ఏమన్నా ఉంటే రేపు చూసుకుందాం.. ఇప్పుడైతే డీజే పెడుతాం.. అంటూ అందరి మనసులను చూరగొన్నాడు ఆ బుడతడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.