Viral Video: లైక్‌ల కోసం ఎంతకైనా దిగజారుతారా.? ఏనుగును ఆటపట్టించడంపై నెటిజన్ల ఆగ్రహం.
Viral Video: ఏమంటూ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో ప్రతీ ఒక్కరూ ఒక క్రియేటర్‌లా ఫీలవుతున్నారు. ఏదో ఒకటి చేయాలి ఇంటర్‌నెట్‌లో పోస్ట్ చేయాలి. దానికి వచ్చిన లైక్‌లను, కామెంట్లను చూసుకొని మురిసిపోవాలి...
Viral Video: ఏమంటూ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో ప్రతీ ఒక్కరూ ఒక క్రియేటర్‌లా ఫీలవుతున్నారు. ఏదో ఒకటి చేయాలి ఇంటర్‌నెట్‌లో పోస్ట్ చేయాలి. దానికి వచ్చిన లైక్‌లను, కామెంట్లను చూసుకొని మురిసిపోవాలి. ఇప్పుడు ఇదొక ట్రెండ్‌లా మారింది. ఏది చేసైనా లైక్‌లు తెచ్చుకోవడమే లక్ష్యంగా పోస్టులు చేస్తున్నారు. ఇందుకోసం ఎంతకైనా దిగజారుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో పైత్యానికి పరాకాష్టగా నిలుస్తోంది.
వివరాల్లోకి వెళితే కొందరు వ్యక్తులు రాత్రిపూట వాహనంలో అడవి గుండా వెళుతున్నారు. ఈ సమయంలోనే వారికి ఒక గున్న ఏనుగు కనిపించింది. ఎలాగో చిన్న ఏనుగు కాబట్టి ఏం చేయదన్న నమ్మకంతో రెచ్చి పోయారు. హారన్‌ను గట్టిగా మోగిస్తూ ఏనుగును బెంబేలెత్తించారు. దీంతో పాపం ఆ ఏనుగు భయపడుతూ వెనుకకు వెళ్లింది. అంతటితో ఆగకుండా ఏనుగును అక్కడి నుంచి వెళ్లే వరకు హారన్‌తో హోరెత్తించారు. దీనంతటినీ వీడియోగా తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందారు.
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూగ జీవి అని చూడకుండా సదరు వ్యక్తులు చేసిన పైత్యాన్ని తప్పుబడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సంఘటన శ్రీలంకలో జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియోను ట్విట్ చేసిన ఓ నెటిజన్.. ‘మీకు ఏమాత్రం బుద్ధి ఉన్నా.. ఇది చాలా తప్పు చర్య అని తెలుసుకుంటారు. సోషల్ మీడియాలో వచ్చే వ్యూస్ కోసం ఇంత దారుణానికి దిగుతారా’.? అని పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లను సైతం ఏనుగు పట్ల యువకుల ప్రవర్తనను తప్పుపడుతున్నారు.
This is the original video off his TikTok account. People like this need to be found and taught a lesson that this shit isn’t acceptable. @wnpssl @PearlProtectors @KumarSanga2 @MahelaJay @RusselArnold69 @Melpeters_x @ashadevos @ashroxx @RajapaksaNamal @GotabayaR @PresRajapaksa pic.twitter.com/8ML1l1TmEK
— Poorna Seneviratne (@PoornaSenev) February 3, 2022
Also Read: IRCTC Tourism: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ
Andhra Pradesh: ముఖ్యమంత్రి జగన్‌తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ.. ఆ విషయంపైనే ప్రధానంగా చర్చ..
AP Crime News: దేవుని సేవ పేరుతో డబ్బుల వసూళ్లు.. లైంగిక వేధింపులు.. విశాఖలో నకిలీ పాస్టర్ లీలలు..