Viral Video: ట్రెండింగ్ సాంగ్‌కు డ్యాన్స్‌తో అదరగొట్టిన తల్లికూతురు.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..
Viral Video: ఏమంటూ సోషల్ మీడియా విస్తృతి పెరిగిందో ఎప్పుడు, ఎవరు, ఎందుకు పాపులర్ అవుతున్నారో తెలియడం లేదు. అప్పటి వరకు అసలు ప్రపంచానికి తెలియని వారు కూడా ఒక్క రోజులో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు...
Viral Video: ఏమంటూ సోషల్ మీడియా విస్తృతి పెరిగిందో ఎప్పుడు, ఎవరు, ఎందుకు పాపులర్ అవుతున్నారో తెలియడం లేదు. అప్పటి వరకు అసలు ప్రపంచానికి తెలియని వారు కూడా ఒక్క రోజులో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. సోషల్ మీడియా స్టార్‌లుగా ఎదిగిపోతున్నారు. ఇంటర్‌నెట్‌కు అవధులు లేకపోయేసరికి ప్రపంచాన్ని తమవైపు తిప్పుకుంటున్నారు. ఇలా సెలబ్రిటీలుగా మారిన సామాన్యులు ఎంతో మంది ఉన్నారు. తాజాగా జాబిలోకి ఓ పల్లీలు అమ్ముకునే చిరు వ్యాపారి చేరాడు.
తన పల్లీలు అమ్ముకునేందుకు ‘కచ్చా బాదమ్’ అంటూ పాడిన పాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. పశ్చి బెంగాల్ కు చెందిన భుబన్ బద్యాకర్ అనే వ్యక్తి కస్టమర్లను ఆకర్షించేందుకు ‘బాదం బాదం కచా బాదం’అంటూ పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. ఆ పాటకు అర్థం తెలియకపోయినా నెటిజన్లు స్టెప్పులేస్తూ సందడి చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ స్టెప్పులతో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.
View this post on Instagram
ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు తల్లికూతుళ్లు ఈ పాటకు స్టెప్పులు వేయడంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. తల్లీకూతుర్లు ఇద్దరూ ఓకే రకమైన డ్రస్ వేసుకొని, ఇద్దరూ ఒకేలా కాలు కదిపిన తీరు నెటిజన్లు ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం ఈ ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక వీడియో చూసిన నెటిజన్లు ఆ ఇద్దరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ తల్లీకూతురు డ్యాన్స్ స్టెప్స్‌పై ఓ లుక్కేయండి..
View this post on Instagram
Also Read: Sourav Ganguly: జట్టు ఎంపికలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పాత్ర ఉందా.. వైరల్ అవుతున్న ఫొటో..
Team India: 1000వ వన్డే ఆడనున్న టీమిండియా.. ఈ జర్నీలో అధిక భాగస్వామ్యం కలిగిన ప్లేయర్ ఎవరో తెలుసా?