నెలన్నరలో ఏడుగురు తోడేళ్లకు బలి !! ఆ గ్రామంలో జరుగుతున్న నరమాంస భక్షక భీభత్సం

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. మనుషులను తినే తోడేళ్ల నీడలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. గత ఒకటిన్నర నెలలో ఏడుగురిని ఈ తోడేళ్లు పొట్టపెట్టుకున్నాయి. ఇప్పుడు మరో మహిళను కూడా చంపేశాయి. ముగ్గురు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Follow us

|

Updated on: Sep 02, 2024 | 8:28 PM

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. మనుషులను తినే తోడేళ్ల నీడలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. గత ఒకటిన్నర నెలలో ఏడుగురిని ఈ తోడేళ్లు పొట్టపెట్టుకున్నాయి. ఇప్పుడు మరో మహిళను కూడా చంపేశాయి. ముగ్గురు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సదర్ రేంజ్ లో గత నెలన్నర రోజులుగా తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. తోడేళ్ల దాడిలో ఇప్పటి వరకు ఏడుగురు చనిపోయారు. ఇందులో కొంతమంది అమాయక పిల్లలు కూడా ఉన్నారు. జిల్లాలోని హార్ది పోలీస్ స్టేషన్ పరిధిలోని దాదాపు 30 గ్రామాల్లో తోడేళ్లు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి.. తోడేళ్ళు ఏదో ఒక గ్రామంలో ఎప్పుడు పడితే అప్పుడు దాడి చేస్తున్నాయి. ఆరు బయట ఆడుకుంటున్న చిన్న పిల్లలను తమ ఆహారంగా చేసుకుంటున్నాయి. తోడేలును పట్టుకోవడంలో బహ్రైచ్ అటవీ శాఖ బృందం విఫలమైంది. దీంతో శ్రావస్తి జిల్లా అటవీ సిబ్బంది సహాయం కోరగా, ఆ టీమ్‌ రంగంలోకి దిగారు. నిరంతర తోడేళ్ల దాడుల దృష్ట్యా, బారాబంకి, లక్నో అటవీ శాఖ బృందాలు రంగంలోకి దిగాయి. బహ్రైచ్ జిల్లా మేజిస్ట్రేట్ మోనికా రాణి పర్యవేక్షణలో 16 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఈ అధికారులంతా షిప్టుల వారీగా రాత్రి పగలు తేడా లేకుండా డ్యూటీ చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

100కోట్ల గూఢచారి.. ఎక్కడా తగ్గడం లేదుగా..

కల్కి2 పై బిగ్ హింట్ ఇచ్చిన లేడీ ప్రొడ్యూసర్

ఇద్దరు ఖైదీల మధ్య గొడవే కొంపముంచిదా ?? దర్శన్‌‌కు గట్టిదెబ్బే పడిందిగా

తన కొడుకు చిలిపితననాన్ని బయటపెట్టిన తమన్ తల్లి

హార్దిక్ పాండ్యాను ప్రేమిస్తున్నా.. షాకిచ్చిన బాలీవుడ్ నటి..