ఇద్దరు ఖైదీల మధ్య గొడవే కొంపముంచిదా ?? దర్శన్‌‌కు గట్టిదెబ్బే పడిందిగా

కర్నాటకలో నటుడు దర్శన్‌ వ్యవహారం దుమారం రేపుతోంది. దర్శన్‌కు జైలులో సకల మర్యాదలు జరుగుతున్నట్టు ఫొటోలు, వీడియోలు బయటకు రావడం హాట్‌ టాపిక్‌గా మారింది. తన స్నేహితుడితో వీడియో కాల్‌ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారడంతో దర్శన్ వ్యవహారంపై జైళ్ల శాఖలో భారీ కుదుపు మొదలైంది. అసలు దర్శన్‌ రాజభోగాల వీడియో లీక్‌ చేయడం వెనుక ఉన్నదెవరు?

ఇద్దరు ఖైదీల మధ్య గొడవే కొంపముంచిదా ?? దర్శన్‌‌కు గట్టిదెబ్బే పడిందిగా

|

Updated on: Aug 31, 2024 | 1:14 PM

కర్నాటకలో నటుడు దర్శన్‌ వ్యవహారం దుమారం రేపుతోంది. దర్శన్‌కు జైలులో సకల మర్యాదలు జరుగుతున్నట్టు ఫొటోలు, వీడియోలు బయటకు రావడం హాట్‌ టాపిక్‌గా మారింది. తన స్నేహితుడితో వీడియో కాల్‌ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారడంతో దర్శన్ వ్యవహారంపై జైళ్ల శాఖలో భారీ కుదుపు మొదలైంది. అసలు దర్శన్‌ రాజభోగాల వీడియో లీక్‌ చేయడం వెనుక ఉన్నదెవరు? ఇద్దరు ఖైదీల మధ్య గొడవే కొంపముంచిదా? అంటే అవుననే అంటున్నారు ఈ వ్యవహారం తెలిసిన వాళ్లు. మరి ఆ ఇద్దరు ఖైదీల్లో ఒకరికి దగ్గరకు ఫోన్‌ ఎలా వచ్చిందన్నదే ఇప్పుడు సస్పెన్స్‌. ఫోన్‌ వినియోగానికి ఎవరు పర్మిషన్‌ ఇచ్చారు? అనేది ఆ సస్పెన్స్‌కు కంటిన్యూవేషన్. ఇక మరోవైపు వీడియోల లీక్‌ దుష్రచారమని కొట్టిపారేస్తోంది కర్నాటక ప్రభుత్వం. అయితే దర్శన్‌ యవ్వారంలో పోలీసు శాఖ తీరును చాలామంది తప్పుబట్టారు. దీంతో ఉన్నతాధికారులు, విచారణకు ఆదేశించారు. దర్శన్ తోపాటు రౌడీ షీటర్లు విల్సన్ గార్డన్, శ్రీనివాస్, మేనేజర్ నాగరాజు కలిసి జైలులో పార్టీ చేసుకోవడంపై దృష్టి సారించింది. పార్టీ చేసుకోవడానికి అనుమతి ఎవరు ఇచ్చారు? కాఫీ, సిగరెట్లు ఎలా సమకూర్చారు? అనేదానిపై ఫోకస్ చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తన కొడుకు చిలిపితననాన్ని బయటపెట్టిన తమన్ తల్లి

హార్దిక్ పాండ్యాను ప్రేమిస్తున్నా.. షాకిచ్చిన బాలీవుడ్ నటి..

కంగనాకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. రాష్ట్రంలో ‘ఎమర్జెన్సీ’ మూవీ బ్యాన్ ??

బాబోయ్.. స్పై కెమెరా !! కనిపెట్టేదెలా ??

Hyderabad: బిలియనీర్లకు సెంటర్ గా హైదరాబాద్

Follow us