కంగనాకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. రాష్ట్రంలో ‘ఎమర్జెన్సీ’ మూవీ బ్యాన్ ??

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‏కు తెలంగాణ ప్రభుత్వం షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెన్సీ సినిమాను రాష్ట్రంలో నిషేధించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మాజీ ఐపీఎస్ అధికారికి తేజ్ దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధి బృందం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ అలీ షబ్బీర్‏ను కలిశారు.

కంగనాకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. రాష్ట్రంలో 'ఎమర్జెన్సీ' మూవీ బ్యాన్ ??

|

Updated on: Aug 31, 2024 | 1:05 PM

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‏కు తెలంగాణ ప్రభుత్వం షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెన్సీ సినిమాను రాష్ట్రంలో నిషేధించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మాజీ ఐపీఎస్ అధికారికి తేజ్ దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధి బృందం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ అలీ షబ్బీర్‏ను కలిశారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ సినిమా విడుదల నిషేధం విధించాలని అభ్యర్థించినట్లు తెలిపారు. ఇక ఈ సినిమాలో సిక్కు సమాజాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని.. 18 మంది సిక్కు సొసైటీ బృందం రిప్రజెంటేషన్‌ సమర్పించినట్టు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ తెలిపారు. ఈ మూవీ షూటింగ్ పూర్తిగా విరుద్ధంగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారన్నారు. దీంతో ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని.. షబ్బీర్ అలీ అన్నారు. ఇక సీఎం రేవంత్‌ కూడా.. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ పై న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతూనే విడుదలను నిషేధించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపినట్టు.. షబ్బీర్‌ చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్.. స్పై కెమెరా !! కనిపెట్టేదెలా ??

Hyderabad: బిలియనీర్లకు సెంటర్ గా హైదరాబాద్

TOP 9 ET News: అప్పుడు చిరంజీవి వంతైతే.. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు

Follow us