Andhra Pradesh: బీచ్‌లో సేద తీరేందుకు వచ్చిన సందర్శకులు.. ఏంట్రీ ఇచ్చిన భల్లూకం.. పరుగో పరుగు!

ఎలుగుబంటి ఎదురుపడితే చావు కళ్లముందు కనిపించినట్లే. అందుకే బంటిని చూస్తే ఎవరైనా బెదరాల్సిందే. శ్రీకాకుళం జిల్లాలో అచ్చంగా అదే జరిగింది. సముద్ర తీరంలో సేద తీరేందుకు వచ్చిన సందర్శకుల కంటపడింది భల్లూకం. జనాన్ని చూడగానే, చంపేస్తాను అనేలా పరిగెత్తుకొచ్చింది. ఎలుగు పరుగు చూసి, అక్కడున్న వారు జంప్‌ అయ్యారు. తృటిలో వారి ప్రాణాలు దక్కాయి.

Andhra Pradesh: బీచ్‌లో సేద తీరేందుకు వచ్చిన సందర్శకులు.. ఏంట్రీ ఇచ్చిన భల్లూకం.. పరుగో పరుగు!
Bear Shocks Beachgoers
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Mar 06, 2024 | 9:55 AM

ఎలుగుబంటి ఎదురుపడితే చావు కళ్లముందు కనిపించినట్లే. అందుకే బంటిని చూస్తే ఎవరైనా బెదరాల్సిందే. శ్రీకాకుళం జిల్లాలో అచ్చంగా అదే జరిగింది. సముద్ర తీరంలో సేద తీరేందుకు వచ్చిన సందర్శకుల కంటపడింది భల్లూకం. జనాన్ని చూడగానే, చంపేస్తాను అనేలా పరిగెత్తుకొచ్చింది. ఎలుగు పరుగు చూసి, అక్కడున్న వారు జంప్‌ అయ్యారు. తృటిలో వారి ప్రాణాలు దక్కాయి.

కాసేపు అలసటి తీర్చుకునేందుకు సముద్రతీరానికి వెళ్లిన సందర్శకులను ఓ ఎలుగుబంటి హడలెత్తించింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలోని శివసాగర్ బీచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మార్చి 5వ తేదీన పట్టపగలే శివసాగర్ బీచ్ లో ఎలుగుబంటి స్వైర విహారం చేసింది. దీంతో ఆహ్లాదం కోసం బీచ్ కు వచ్చిన సందర్శకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన గుడిసెల్లో చొరబడడంతో దిక్కుతోచక జనాలు భయంతో పరుగులు తీశారు. ఇక చివరికి భల్లూకం సమీపంలో ఆడవుల్లో పరుగులు తీసింది. దీంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. కాగా, భల్లూకంనకు సంబంధించి సందర్శకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారాయి.

వీడియో చూడండి… 

ఈమద్య ఎలుగుబంట్లు ఉద్దానం ప్రాంతంలో రాత్రి, పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఎలుగుబంట్లు గ్రామాల్లోకి చొరబడుతుండడంతో ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని బయటకు రావాలంటేనే ఉద్దాణ ప్రాంత వాసులు బెంబేలెత్తుతున్నారు. ఆటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లు నుండి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఇటీవల వజ్రపు కొత్తూరు మండలంలో ఎలుగుబంట్లు మనుషులపై దాడులు చేసి తీవ్రంగా గాయపరిచటంతో చుట్టూ పక్కల ప్రజలు ఎలుగుబంటి అంటేనే హడలెట్టిపోతున్నారు. భయం గుప్పిట కాలం వెళ్ళదీస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..