ఆ శివలింగాన్ని నీటిలో ఉంచకపోతే.. అగ్ని ప్రమాదం సంభవిస్తుందా వీడియో
సాధారణంగా ఆలయం అంటే నిత్య పూజలు, భక్తుల దర్శనం ఇలా సాంప్రదాయ బద్ధంగా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాని పశ్చిమగోదావరి జిల్లాలో ఆ గుడిని మాత్రం నిత్యం నీటిలో ఉంచుతారు. కేవలం గోపురం మాత్రమే కనిపిస్తుంటుంది. అలా అని ఆ గుడి ఏ నది మధ్యలోనో లేదు. ఓ పక్కగా ఉంటుంది. కాని ఒక్క వైశాఖ మాసంలో నెల రోజులు మాత్రం నీటిని తోడి భక్తులకు దర్శనం కోసం వీలు కల్పిస్తారు. పండ్ల రసాలతో స్వామి వారికి అభిషేకాలు జరుగుతాయి. ఈ ఆనవాయితీ ఇప్పటిది కాదు త్రేతాయుగంకు పూర్వం నుంచి కొనసాగుతూ వస్తుంది.
గుడిని నీటితో నింపకపోతే ఆ పరిసరాల్లో అగ్నిప్రమాదం జరిగి ప్రమాదాలు సంభవిస్తాయని స్ధానికుల విశ్వాసం. పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో ఉంది ఈ ఆలయం. పూర్వం మాతృహత్యాపాతకం నుంచి తప్పించుకోవడం కోసం పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్టించాడని చెబుతారు. ఇక్కడ మరో శివలింగం కనిపిస్తుంది. దీనిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతతో కలిసి వచ్చి స్వామి వారిని దర్శించుకుని నత్తగుళ్లలు, ఇసుకతో శివలింగం చేసి ప్రతిష్టించారని కథనం ఉంది. అందుకే ఈ ప్రాంతానికి నత్తా రామేశ్వరం గాను పేరు వచ్చింది. ఇక లక్ష్మణుడు ప్రతిష్టించిన మరో శివలింగం కూడా ఉండటంతో ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రంగా భక్తులు పిలుచుకుంటారు. ఈ ఏడాది వైశాఖ మాసం ప్రారంభం అంటే ఏప్రిల్ 28 నుంచి ఆలయంలో ఉన్న నీటిని మొత్తం తోడి స్వామి దర్శనం భక్తులకు అధికారులు కల్పిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
మనవడితో మహిళ జంప్.. వయసులో ఉన్న మనవళ్లు ఉంటే..మీ భార్యలు జాగ్రత్త!
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..! కాబోయే అల్లుడితో మరో అత్త జంప్..
సరిగ్గా దండలు మార్చుకునే టైంకి..పెళ్లి కొడుకు ఫేస్ చూసి బిత్తరపోయిన వధువు