వాడు నావాడంటే.. నావాడు అంటూ ఓ సీఐ కోసం పోలీస్‌స్టేషన్‌లో కొట్టుకున్న మహిళలు
గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఇద్దరు మహిళలు బాహాబాహీకి దిగారు. ఓ సీఐ నావాడంటే నావాడంటూ ఇద్దరు మహిళలు జుట్లు పట్టకుని పోలీస్ స్టేషన్‌లోనే కొట్టుకున్నారు. గుంటూరు రూరల్ మండలం నల్లపాడుకు చెందిన మహిళతో నగరంలో పనిచేస్తున్న ఓ సీఐ గతంలో సన్నిహితంగా ఉన్నారు. ఇటీవల ఆ సీఐకు నగరంలోని ఓ సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని పరిచయమయ్యింది
వారిద్దరు సన్నిహితంగా ఉంటూ తనను బెదిరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని నల్లపాడుకు చెందిన మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేయటానికి పోలీసు కార్యాలయానికి వచ్చారు. విషయం తెలుసుకున్న సదరు సచివాలయ ఉద్యోగిని కూడా పోలీసు కార్యాలయానికి చేరుకున్నారు. ఇద్దరు ఎదురెదురుపడటంతో మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడ ఉన్న మహిళా పోలీసులు వెంటనే వారిద్దర్నీ విడతీశారు. తరవాత నల్లపాడుకు చెందిన మహిళ పోలీసు అధికారులను కలిసి సీఐపై ఫిర్యాదు చేశారు. నల్లపాడుకు చెందిన మహిళ వ్యభిచారం చేస్తూ హైదరాబాద్‌లో జైలుశిక్ష అనుభవించి వచ్చిందని, తనను కూడా వ్యభిచారం చేయమని ఒత్తిడి చేస్తుందని సచివాలయ ఉద్యోగిని కూడా ఫిర్యాదు చేశారు. అందుకు ఒప్పుకోలేదని అందరితో సంబంధం అంటగడుతూ వేధిస్తుందని, ఫిర్యాదు చేయటానికి వస్తే తనపై దాడిచేసిందని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
మనవడితో మహిళ జంప్.. వయసులో ఉన్న మనవళ్లు ఉంటే..మీ భార్యలు జాగ్రత్త!
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..! కాబోయే అల్లుడితో మరో అత్త జంప్..
సరిగ్గా దండలు మార్చుకునే టైంకి..పెళ్లి కొడుకు ఫేస్ చూసి బిత్తరపోయిన వధువు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
