ఈ పండు పోషకాల పవర్‌హౌజ్‌.. ఆరోగ్యప్రయోజనాలు మెండు

సాధారణంగా మనం మామిడి, జామ, యాపిల్, అరటి, నారింజ, బత్తాయి, దానిమ్మ, పియర్, పుచ్చకాయ వంటి పండ్లను ఎక్కువగా తింటుంటాం. కానీ, కొన్ని ప్రత్యేకమైన, చాలా అరుదుగా లభించే పండ్లు కూడా ఉన్నాయి. అలాంటి అరుదైన పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటిదే పాషన్ ఫ్రూట్. దీనినే కృష్ణా పండు అని కూడా అంటారు. ఈ పాషన్ ఫ్రూట్ లోపల గుజ్జు, గింజలతో కూడి ఉంటుంది. దీని తొక్క మాత్రం గట్టిగా చూడటానికి కాస్త మారేడు కాయకు దగ్గరగా ఉంటుంది.

ఈ పండు పోషకాల పవర్‌హౌజ్‌.. ఆరోగ్యప్రయోజనాలు మెండు

|

Updated on: Jul 21, 2024 | 5:04 PM

సాధారణంగా మనం మామిడి, జామ, యాపిల్, అరటి, నారింజ, బత్తాయి, దానిమ్మ, పియర్, పుచ్చకాయ వంటి పండ్లను ఎక్కువగా తింటుంటాం. కానీ, కొన్ని ప్రత్యేకమైన, చాలా అరుదుగా లభించే పండ్లు కూడా ఉన్నాయి. అలాంటి అరుదైన పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటిదే పాషన్ ఫ్రూట్. దీనినే కృష్ణా పండు అని కూడా అంటారు. ఈ పాషన్ ఫ్రూట్ లోపల గుజ్జు, గింజలతో కూడి ఉంటుంది. దీని తొక్క మాత్రం గట్టిగా చూడటానికి కాస్త మారేడు కాయకు దగ్గరగా ఉంటుంది. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ పాషన్‌ ఫ్రూట్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తినడం వల్ల బ్లడ్ షుగర్, ఊబకాయం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం ప్రజలు కివీ, అవకాడో, బ్లూబెర్రీ వంటి అన్యదేశ పండ్లను బాగా వినియోగిస్తున్నారు. అదేవిధంగా ప్యాషన్ ఫ్రూట్ అంటే కృష్ణా పండుకి కూడా డిమాండ్ బాగా పెరిగింది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్న పాషన్ ఫ్రూట్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆగిపోయిన గుండెను.. 5 నిమిషాల్లో కొట్టుకునేలా చేసింది

ఆదర్శ వైద్యుడు !! గిరిజనుల కోసం కొండలు, కోనలు దాటి..

దారుణం.. ముక్కుపచ్చలారని చిన్నారిపై..

బటర్ మిల్క్ ప్యాకెట్ లో పురుగులు.. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియో వైరల్

నదిని ఈదిన పారిస్‌ మేయర్‌.. విషయం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే !!

Follow us