ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ఆర్టీసీ బస్సు ముందే డ్రైవర్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డ్రైవర్ డ్యాన్స్ అదిరిందంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్స్ అభినందించారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం నారా లోకేష్ కూడా సదరు డ్రైవర్ డ్యాన్స్ ట్యాలెంట్‌ను అభినందించారు. అయితే దీన్ని క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ ఆ డ్రైవర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది.