- Telugu News Photo Gallery Cinema photos Sai pallavi meenakshi chaudhary rashmika mandanna coming with year ending movies
ఇయర్ ఎండింగ్ రిలీజ్’కు మేం రెడీ అంటున్న హీరోయిన్లు.. ఆ లక్కీ లేడీస్ ఎవరంటే ??
ఇయర్ ఎండింగ్‌కి వచ్చేసింది చూడ్డానికి ఇంకేముంది అనుకుంటున్నారా.. ఇంకా ఉంది అంటున్నారు కొంతమంది హీరోయిన్స్.. ఈ ఇయర్ ఎండింగ్ ను కలర్ ఫుల్ గా ఎండ్ చేస్తాం అంటున్నారు ఈ ముద్దుగుమ్మలు.. అసలు సిసలు సందడి ఇప్పుడే షురూ అవుతోందంటున్నారు. కలర్‌ఫుల్‌గా కనిపించడానికి రెడీ అంటున్న లక్కీ లేడీస్ ఎవరంటే ??
Updated on: Oct 30, 2024 | 9:55 PM

ఇయర్ ఎండింగ్‌కి వచ్చేశాం... ఇంకేముంది చూడ్డానికి.. కొత్త సంవత్సరం కోసం వెయిట్ చేయడం తప్ప అని ఎవరూ అనుకోవద్దని స్ట్రాంగ్‌గా సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారు వెండితెర నటీమణులు కొందరు. అసలు సిసలు సందడి ఇప్పుడే షురూ అవుతోందంటున్నారు. కలర్‌ఫుల్‌గా కనిపించడానికి రెడీ అంటున్న లక్కీ లేడీస్ ఎవరు?

మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన గుంటూరు కారం ఈ ఏడాది రిలీజ్ అయింది. ఈ మధ్యనే గోట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు లక్కీ భాస్కర్ లైన్లో ఉంది. త్వరలోనే మెకానిక్ రాఖీ ప్రేక్షకులను పలకరిస్తుంది. ముందూ వెనుకలుగా మెగా హీరోలతోనూ ప్రాజెక్టులున్నాయి ఈ బ్యూటీకి.

ఒకే రోజు రెండు భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయనే క్రెడిట్‌ని కొంచెంలో మిస్ అయ్యారు రష్మిక మందన్న. డిసెంబర్ ఐదున పుష్ప2 వస్తే, ఆరున రావడానికి రెడీ అవుతోంది చావా సినిమా. సో... బ్యాక్ టు బ్యాక్ రిలీజులతో హంగామా ఉంటుందంటున్నారు నేషనల్ క్రష్.

వయలెన్స్, పీస్ విషయాల్లో ఎవరి దృక్పథం వారిది... అంటున్నారు సాయిపల్లవి. ఆమె నటించిన అమరన్ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 20న తండేల్ రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాల్లోనూ దేశభక్తి టచ్ ఉంటుంది.

ఆల్రెడీ కల్కి సినిమాతో సౌత్‌లో బోణీ కొట్టేశారు దిశా పాట్ని. ఆమె వచ్చే నెల్లో కంగువతో మరోసారి లిట్మస్ టెస్ట్ కి రెడీ అవుతున్నారు. డిసెంబర్ 20న రాబిన్‌హుడ్ రిలీజ్ అయితే, ఈ ఏడాది శ్రీలీల ఖాతాలో ఓ సినిమా పడ్డట్టే. రీసెంట్‌గా వేట్టయన్‌లో మనసిలాయో అంటూ మెప్పించిన మంజు వారియర్ కూడా విచారణై2తో మరోసారి ప్రేక్షకులకు హలో చెప్పడానికి రెడీ అవుతున్నారు.




