ట్రాఫిక్ పోలీస్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్ !!
కర్ణాటకలోని శివమొగ్గలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును ఓ వ్యక్తి కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఎస్‌యూవీ నడుపుతున్న ఓ వ్యక్తి అతివేగంగా డ్రైవింగ్ చేస్తున్నందుకు ట్రాఫిక్ పోలీస్ ఆపమని అడిగాడు. అయితే అతను కారు ఆపకపోగా.. ట్రాఫిక్ అధికారిని ఢీకొట్టాడు.
దాంతో అతను కారు బానెట్‌పై పడిపోయాడు. అయినా కారు ఆపకుండా పోలీసును కారు బ్యానెట్‌పై ఈడ్చుకెళ్ళాడు. సహ్యాద్రి కళాశాల సమీపంలో సాధారణ వాహన తనిఖీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇంత అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తి భద్రావతిలో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మిథున్ జగదలేగా పోలీసులు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు శివమొగ్గ పోలీసు సూపరింటెండెంట్ వెల్లడించారు. గతేడాది డిసెంబరులో కూడా బెంగుళూరులో ఇదే తరహా సంఘటన జరిగింది. రోడ్డుపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నందుకు ఆపడానికి ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసుపై ఆటో డ్రైవర్ వాహనం ఎక్కించడానికి ప్రయత్నించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీళ్లు దీపావళి రాకెట్‌ను ఎలా పేల్చారో చూస్తే షాకవుతారు !!
LPG Gas Cylinder: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లను ఎలా పొందాలంటే ??
Sai Pallavi: బాలీవుడ్ గురించి సాయిపల్లవి సంచలన కామెంట్స్
నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు తాళాలే !!
కొన్ని గంటల్లో పెళ్లి.. వరుడికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వధువు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

