LPG Gas Cylinder: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లను ఎలా పొందాలంటే ??
ఏపీ ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వం దీపావళి ధమాకా వార్త చెప్పింది. ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ పథకం బుకింగ్స్ ప్రారంభమవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈనెల 31 నుంచి మార్చి 31 వరకు మొదటి సిలిండర్ ఎప్పుడైనా తీసుకోవచ్చని అన్నారు. గ్యాస్ కనెక్షన్ ఉండి… తెల్ల రేషన్ కార్డు, ఆధార్ ఉన్నవాళ్లు ఈ పథకానికి అర్హులని అన్నారు.
అర్హత ఉన్న ప్రతీ కుటుంబం అక్టోబర్ 31 నుంచి మార్చ్ 31 వరకు మొదటి సిలిండర్ ఎప్పుడైనా తీసుకోవచ్చని చెప్పారు. గ్యాస్ సిలిండర్ అందిన వెంటనే మీరు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో ప్రభుత్వం తిరిగి డీబీటీ ద్వారా నగదు వెనక్కి ఇచ్చేస్తుందన్నారు. గ్యాస్ సిలిండర్ పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే 1967 కు కాల్ చేసి సేవలు పొందొచ్చని మంత్రి చెప్పారు. వీలైనంత ఎక్కువ మందికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని.. ప్రస్తుతం 1.47 కోట్ల వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అధికారంలోకి వస్తే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఉస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఆ పథకాన్ని అమలుచేస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ దీపావళి నుంచి ఈ పథకం అమలులోకి వస్తుంది. అర్హులైన వారందరికీ ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనుంది. ఈ పథకానికి ఏడాదికి 2వేల 684 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sai Pallavi: బాలీవుడ్ గురించి సాయిపల్లవి సంచలన కామెంట్స్
నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు తాళాలే !!
కొన్ని గంటల్లో పెళ్లి.. వరుడికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వధువు