కొన్ని గంటల్లో పెళ్లి.. వరుడికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వధువు
ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నారు. విడిది ఇంట్లో వియ్యాలవారికి మర్యాదలు చేస్తూ ఉన్నారు వధువు కుటుంబ సభ్యులు.. మరోవైపు చుట్టాలు, బంధువులు అంతా పెళ్లికి హాజరయ్యారు. ముహూర్తానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇంతలో పెళ్లికూరుతు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది.
ఆ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో చోటుచేసుకుంది. అనంతపురంకి చెందిన నరేంద్ర కుమార్ కుమార్తె వైష్ణవికి, కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన బజారి కుమారుడు విశ్వాసికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. తెల్లవారితే పెళ్లి, రాత్రి సంప్రదాయాల ప్రకారం చిన్నతాంబులం,పెద్ద తాంబూలం కూడా చేశారు. అయితే అమ్మాయికి ఇష్టం లేకపోవడంతో నాలుగు గంటలకు గోపాల్ ప్లాజా కళ్యాణ మండపం నుండి వెళ్లిపోయింది. కొన్ని గంటలలో జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. పెళ్లి నిలిచిపోవడంతో పెళ్లి కుమార్తె తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. పత్తికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు కళ్యాణ మండపం నుండి ఒక అబ్బాయితో వెళ్ళిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. జరగాల్సిన పెళ్లి ఒక్కసారిగా నిలిచిపోవడంతో అటు పెళ్లికూతురు , అటు పెళ్లికూతురు ,ఇటు పెళ్లి కుమారుడు బంధువులు నిరుత్సాహ గా ఉండిపోయారు. ఏమైనా ఉంటే పెళ్లికి ముందే చూసుకోవాలని ఇలా పెళ్లి ఆపడం మంచిపద్దతి కాదని అబ్బాయి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుత్సాహంగా తిరిగి వెళ్లిపోయారు వరుడి తరపు బంధువులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చాపకింద నీరులా వచ్చి.. కాటికి దారి చూపిస్తోంది
అంతరిక్ష యాత్రకు రెడీనా ?? టికెట్ ధర రూ. 1.77 కోట్లు మాత్రమే
తండ్రి వెనుక కూర్చోగా స్కూటర్ నడుపుతున్న బాలిక !! మండిపడుతున్న నెటిజన్లు
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

