AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupathi: తిరుమలలో భక్తులు స్వయంగా ఒక్క రోజు అన్నదానం చేయాలంటే ఎంతో తెలుసా?

తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్నప్రసాదాలను టిటిడి అందిస్తోంది. ఇక వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన..

Tirupathi: తిరుమలలో భక్తులు స్వయంగా ఒక్క రోజు అన్నదానం చేయాలంటే ఎంతో తెలుసా?
Tirumala
Raju M P R
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 31, 2024 | 8:07 AM

Share

తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదానం మీ చేతులతో జరగాలని భావిస్తున్నారా..? అయితే టీటీడీ ఆ అవకాశం భక్తులకు కనిపిస్తోంది. రూ.44 లక్షల విరాళంతో ఒకరోజు అన్నప్రసాద వితరణకు అవకాశం కల్పించింది. దాతలు స్వయంగా వడ్డించేలా నిర్ణయం తీసుకుంది. దాతల పేరును ప్రదర్శించనుంది.

తిరుమల, తిరుపతి లో కలిపి రోజుకు దాదాపు 2.5 లక్షల మందికి అన్న ప్రసాద వితరణ చేసేందుకు వీలు కల్పించింది. తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ఇప్పటికే అమల్లో ఉంది. ప్ర‌స్తుతం అన్నప్రసాద వితరణ కోసం విరాళాల‌ వివ‌రాలను ప్రకటించిన టిటిడి. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కు రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించ వచ్చంది. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్షించనుంది. అదే విధంగా దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందవచ్చనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 లోని కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్‌లు, అన్నప్రసాదం, తిరుపతిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామి వారి ఆల‌యం, శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా టిటిడి అన్నప్రసాద వితరణ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్నప్రసాదాలను టిటిడి అందిస్తోంది. ఇక వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందిస్తోంది. ప్రస్తుతం టీటీడీ అన్న ప్రసాద విభాగం తిరుమల మరియు తిరుపతిలలో రోజుకు దాదాపు 2.5 లక్షల మందికి అన్న ప్రసాద వితరణ ( టీ, కాఫీలు, పాలు కలిపి) చేస్తున్నది. ఇందుకు గాను అయ్యే ఖర్చును ఒక రోజు ఆన్న ప్రసాద వితరణగా భక్తులు విరాళంగా ఇంచ్చేందుకు ఈ మేరకు అవకాశం కల్పించింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి