AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Board New Chairman: తిరుమల నూతన ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు.. 24 మంది సభ్యులతో కొత్త బోర్డు ఏర్పాటు

కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఛైర్మన్ గా బీఆర్‌ నాయుడు నియామకమయ్యారు. ఈ మేరకు 24 మంది సభ్యులతో కూడిన నూతన బోర్డును కూటమి సర్కార్ ఏర్పాటు చేసింది. ఇందులో జనసేన నేతలు ముగ్గురికి చోటు దక్కింది..

TTD Board New Chairman: తిరుమల నూతన ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు.. 24 మంది సభ్యులతో కొత్త బోర్డు ఏర్పాటు
TTD Board New Chairman
Srilakshmi C
|

Updated on: Oct 31, 2024 | 6:15 AM

Share

అమరావతి, అక్టోబర్‌ 31: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకమయ్యారు. ఈ మేరకు ఏపీ సర్కార్‌ 24 మంది సభ్యులతో కూడిని నూతన టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేసింది. తితిదే ఛైర్మన్‌గా నియమితులైన బీఆర్‌ నాయుడు మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, ఎన్డీయే కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపారు. తాను కూడా తిరుమలలోనే పుట్టి పెరిగానని, అక్కడి విషయాలన్నీ తనకు క్షుణ్ణంగా తెలుసని అన్నారు. అందుకే తన బాధ్యత మరింత పెరిగిందని ఈ సందర్బంగా ఆయన వ్యాఖ్యానించారు. తిరుమలలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, వాటిపై సీఎం చంద్రబాబుతో చర్చించానన్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరోసారి ఆయనతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. తిరుమల భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి వంటి తదితర అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పాలకమండలి ఆమోదంతో పూర్తి చేయాలన్నదే తన ఆశయమన్నారు. ఈ బాధ్యత తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.

నూతనంగా నియమితులైన టీటీడీ బోర్డు సభ్యులు వీరే..

  • జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
  • వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)
  • ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
  • పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)
  • జాస్తి పూర్ణ సాంబశివరావు
  • నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)
  • సదాశివరావు నన్నపనేని
  • కృష్ణమూర్తి ( తమిళనాడు)
  • కోటేశ్వరరావు
  • మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌
  • జంగా కృష్ణమూర్తి
  • దర్శన్‌. ఆర్‌.ఎన్‌ (కర్ణాటక)
  • జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌ (కర్ణాటక)
  • శాంతారామ్‌
  • పి.రామ్మూర్తి (తమిళనాడు)
  • జానకీ దేవి తమ్మిశెట్టి.(మంగళగిరి)
  • బూంగునూరు మహేందర్‌ రెడ్డి (తెలంగాణ – జన సేన)
  • అనుగోలు రంగశ్రీ (తెలంగాణ – జన సేన)
  • బూరగాపు ఆనందసాయి (తెలంగాణ- జన సేన)
  • సుచిత్ర ఎల్ల (తెలంగాణ)
  • నరేశ్‌కుమార్‌ ( కర్ణాటక)
  • డా.అదిత్‌ దేశాయ్‌ (గుజరాత్‌)
  • సౌరబ్‌ హెచ్‌ బోరా (మహారాష్ట్ర)

జనసేన కోటాలో ముగ్గురికి టీటీడీ పాలకమండలిలో చోటు దక్కింది. జనసేనా తెలంగాణ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి,ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి, జన సేన ట్రెజరర్ ఏ ఎం రత్నం సతీమణి రంగశ్రీ.. టీటీడీ పాలకమండలిలో స్థానం దక్కించుకున్నారు. గతంలో పాలకమండలి సభ్యులుగా వున్న ప్రశాంతి రెడ్డి, జంగా కృష్ణమూర్తి, సుచిత్రా ఎల్లాకు మరోసారి అవకాశం లభించింది. వీరిలో కృష్ణమూర్తి వైద్యనాధన్ వరుసగా ఆరోవసారి టిటిడి పాలకమండలి సభ్యుడిగా ఎంపికై రికార్డు సృష్టించారు.

టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్‌ నాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినంద‌న‌లు…

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్‌గా నియ‌మితులైన బీఆర్ నాయుడుకు, బోర్డు స‌భ్యుల‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వరస్వామి ఆల‌య ప‌విత్రత‌ను, ఔన్నత్యాన్ని మ‌రింత‌గా పెంచేలా నూత‌నంగా నియ‌మితులైన ఛైర్మన్‌, బోర్డు స‌భ్యులు కృషి చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.