Samantha: నార్త్ లో వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న సమంత
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ లీగ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కొన్ని రోజు బ్రేక తీసుకోవడం వల్ల కొద్దిగా గ్యాప్ వచ్చింది సామ్ కు .. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తుంది. అయితే తాను బాలీవుడ్ ఎంట్రీ కోసం ఇద్దరు దర్శకుల హెల్ప్ తీసుకుంటున్నారు. వాళ్ల కాంపౌండ్‌లోనే వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నారు సామ్.
Updated on: Oct 30, 2024 | 9:01 PM

ఒకప్పుడు స్టార్ లీగ్‌లో కనిపించిన.. ఈ మధ్య స్లో అయ్యారు. హెల్త్ ఇష్యూస్ కారణంగా బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ తరువాత బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. తన నార్త్ జర్నీకి ఇద్దరు దర్శకుల హెల్ప్ తీసుకుంటున్నారు. వాళ్ల కాంపౌండ్‌లోనే వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నారు సామ్.

సమంత ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసిన ప్రాజెక్ట్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. అప్పటి వరకు సౌత్ సినిమాల్లో జస్ట్ గ్లామర్ హీరోయిన్‌గా మాత్రమే ఉన్న సామ్, ఈ షోలో బోల్డ్ సీన్స్‌లో నటించారు. నార్త్ ఎంట్రీలో బోల్డ్ ఇమేజ్ సమంతకు బాగానే హెల్ప్ అయ్యింది.

అందుకే అదే టీమ్‌తో వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సామ్. ఆల్రెడీ ది ఫ్యామిలీ మ్యాన్ 3లోనూ సమంత కనిపించబోతున్నారన్న హింట్ ఇచ్చారు మేకర్స్. ది ఫ్యామిలీ మ్యాన్ 2 తెరకెక్కించిన రాజ్ అండ్ డీకేనే, త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న సిటాడెల్ హనీ బన్నీకి కూడా దర్శకులు.

హాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన సిటాడెల్‌ను ఇండియన్ నేటివిటికీ తగ్గట్టుగా మార్చి తెరకెక్కించారు రాజ్ అండ్ డీకే. ప్రజెంట్ రక్త బ్రహ్మాండ్ అనే భారీ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నారు రాజ్ అండ్ డీకే.

పీరియాడిక్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో ఆదిత్యరాయ్ కపూర్, అలీ ఫజల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ షోలో సమంత యువరాణిగా కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇలా వరుసగా రాజ్ డీకే కాంపౌండ్‌లోనే నటిస్తుండటంతో సమంత ఇక సౌత్‌కు గుడ్ బై చెప్పేసినట్టేనా అన్న చర్చ జరుగుతోంది.




