బటర్ మిల్క్ ప్యాకెట్ లో పురుగులు.. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియో వైరల్
అధిక ప్రొటీన్ మజ్జిగతో పాటు అమూల్ కంపెనీ పురుగులను కూడా ఫ్రీగా పంపించిందంటూ ఓ కస్టమర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. తను అందుకున్న బటర్ మిల్క్ ప్యాకెట్ ను, వాటిలో తిరుగుతున్న పురుగులను ఫొటోలు, వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఈ పోస్టు వైరల్ గా మారింది. గంటల వ్యవధిలోనే లక్షలాది మంది ఈ పోస్టును చూశారు. అమూల్ కంపెనీ తీరుపై కామెంట్లలో దుమ్మెత్తిపోస్తున్నారు.
అధిక ప్రొటీన్ మజ్జిగతో పాటు అమూల్ కంపెనీ పురుగులను కూడా ఫ్రీగా పంపించిందంటూ ఓ కస్టమర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. తను అందుకున్న బటర్ మిల్క్ ప్యాకెట్ ను, వాటిలో తిరుగుతున్న పురుగులను ఫొటోలు, వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఈ పోస్టు వైరల్ గా మారింది. గంటల వ్యవధిలోనే లక్షలాది మంది ఈ పోస్టును చూశారు. అమూల్ కంపెనీ తీరుపై కామెంట్లలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులను కోరుతున్నారు. అమూల్ కస్టమర్ ఒకరు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ లో నెటిజన్లతో పంచుకున్నారు. ఇటీవల తాను ఆన్ లైన్ వేదికగా అమూల్ బటర్ మిల్క్ ఆర్డర్ చేశానని చెప్పారు. అయితే, కంపెనీ నుంచి వచ్చిన ప్యాకెట్ ను విప్పిచూశాక షాక్ కు గురయ్యానని వివరించారు. ప్యాకెట్ లో పురుగులు కనిపించడమే కారణమని చెప్పారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. తమకూ ఇలాంటి అనుభవమే ఎదురైందని, అమూల్ ఉత్పత్తులు ఎవరూ కొనొద్దని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను ఏకంగా నాలుగున్నర లక్షల మంది చూశారు. వీడియో వైరల్ కావడంతో అమూల్ కంపెనీ స్పందించింది. దీనిపై వివరణ ఇచ్చిన అమూల్ కంపెనీ కస్టమర్ కు క్షమాపణలు చెబుతూ మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నదిని ఈదిన పారిస్ మేయర్.. విషయం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే !!
నడీ సముద్రంలో బోటుకు రంధ్రం.. ఎలా బయటపడ్డారో తెలుసా ??
గొడవలు.. గిడవలు ఏం లేవ్.. అన్నీ పూసగుచ్చినట్టు చెప్పిన బన్నీ ఫ్రెండ్
చిన్న పొరపాటుకు మూల్యం ఈ హీరోయిన్ ప్రాణం !!
TOP 9 ET News: వావ్ !! RRR కలెక్షన్స్ గాయబ్.. దూసుకుపోతున్న కల్కి
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

