Viral Video: యూరో 2020 ఫలితాలను ముందే చెప్పేస్తోన్న ప్రిడిక్షన్ పిల్లి! వీడియో వైరల్

అంచనాలు అందరూ చేస్తారు. కానీ, ఈ ప్రిడిక్షన్స్‌లో కొందరివే నిజమవుతాయి. మిగతావి ఫెయిల్ అవుతాయి. అయితే నేను అంచనా వేస్తే.. కచ్చితంగా జరగాల్సిందేనంటోంది ఓ పిల్లి.

Viral Video: యూరో 2020 ఫలితాలను ముందే చెప్పేస్తోన్న ప్రిడిక్షన్ పిల్లి! వీడియో వైరల్
Prediction Cat
Follow us
Venkata Chari

|

Updated on: Jun 16, 2021 | 1:12 PM

Prediction Cat: అంచనాలు అందరూ చేస్తారు. కానీ, ఈ ప్రిడిక్షన్స్‌లో కొందరివే నిజమవుతాయి. మిగతావి ఫెయిల్ అవుతాయి. అయితే నేను అంచనా వేస్తే.. కచ్చితంగా జరగాల్సిందేనంటోంది ఓ పిల్లి. అవును మీరు విన్నది నిజమే. రష్యాకు చెందిన ఈ పిల్లి మ్యాచ్‌ ఫలితాలను సరిగ్గా అంచనా వేస్తుండడంతో… అంతా దీనిని ప్రిడిక్షన్ పిల్లి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. అయితే, తాజాగా ఈ పిల్లి యూరో 2020 ఫలితాలను ముందుగానే అంచనా వేసి చెప్పేస్తోంది. ఈ పిల్లి చెప్పే ఫలితాలు నిజమవడంతో… ప్రస్తుతం ఈ పిల్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో ఉంది ఈ ప్రిడిక్షన్ పిల్లి. ఈ పిల్లి పేరు ‘అచిల్లేస్’. దీనికి చెవులు కూడా పనిచేయవంట. సెయింట్ పీటర్స్బర్గ్ లోని హెర్మిటేజ్ మ్యూజియంలో నివసిస్తోంది. గత కొన్నేళ్లుగా సాకర్ ఫలితాను ఖచ్చితంగా అంచనా వేస్తుందంట. ఫలితాలను ఎలా నిర్ణయిస్తోందంటే.. మ్యాచ్ కు ముందు తలపడే రెండు దేశాల జెండాలను ఈ పిల్లి ముందు ఉంచుతారు. జెండాలతో పాటు వాటి పక్కనే ఆహారాన్ని రెండు గిన్నెల్లో పోసి ఉంచుతారు. ఈ ప్రిడిక్షన్ పిల్లి వెళ్లి ఏ గిన్నెలో ఆహారాన్ని తింటుందో.. ఆ దేశం విజయం సాధిస్తుందన్నమాట.

ఈ ప్రిడిక్షన్ పిల్లి 2017 నుంచి ఇక్కడే నివసిస్తోందంట. అంతకుమందు కాన్ఫెడరేషన్ కప్ సందర్భంగా ఓపెనింగ్ మ్యాచ్ ఫలితాన్ని సరిగ్గా అంచనా వేసిందంట ఈ అచిల్లేస్. దీంతో ఈ పిల్లి ప్రిడిక్షన్‌పై అందరికీ చాలా నమ్మకం ఏర్పడిందంట. అలాగే 2018 లో ప్రపంచ కప్ లో రష్యా ఖచ్చితంగా గెలుస్తుందని అంచనా వేసింది. అలాగే జరిగింది.

అయితే తాజాగా జరుగుతున్న యూరో 2020 మ్యాచ్‌ల ఫలితాలను కూడా ఖచ్చితంగా అంచనా వేస్తుంది. జూన్ 12 నుంచి ప్రారంభమైన యూరో కప్ తొలి మ్యాచ్‌లో ఇటలీ, టర్కీ దేశాలు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇటలీ గెలుస్తుందని, ఈ దేశ జెండాను చూపించింది. ప్రిడిక్షన్ పిల్లి అంచనా మేరకు ఆ మ్యాచ్‌లో ఇటలీ 3-0తేడాతో టర్కీని ఓడించింది. అలాగే బెల్జియం, రష్యా మ్యాచ్‌లోనూ కచ్చితంగా అంచనా వేసింది. ఈ మ్యాచ్‌లో బెల్జియం 3-0 తేడాతో రష్యాను ఓడించింది.

Also Read:

Viral Video: సింగపూర్‌లో చైనా వ్యక్తి ఎక్స్‌ట్రాలు.. భారతీయ సిబ్బందిపై తిట్లు.. చివరకు..

VIRAL VIDEO : పొదల్లో నక్కిన పులి మాటువేసి జింకపై దాడి..! మామూలుగా లేదు పులి వేట.. వైరల్ వీడియో..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు