తెలంగాణలో ఐదు రోజులు దంచి కొట్టనున్న వానలు వీడియో
తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.మంగళవారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వానలు పడే అవకాశాలున్నాయని చెప్పింది.
బుధవారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం,సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కొత్తగూడెం, కమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని హెచ్చరించింది.అలాగే గురు, శుక్రవారాల్లోనూ ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
మరిన్ని వీడియోల కోసం :
ఓల్డ్‌సిటీ అగ్నిప్రమాదంలో గుండెలు బద్దలయ్యే వివరాలు వీడియో
మూడో ప్రపంచయుద్ధమే వస్తే .. ఈ దేశాలు సేఫేనా?వీడియో
51 రోజులు.. 1,000 కి.మీ.. శ్రీలంక మీదుగా ఆంధ్రాకు వీడియో

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
