Prakash Singh: జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో సత్తా చాటుతున్న హైదరాబాదీ పహిల్వాన్‌.. ఏకంగా 50కు పైగా పతకాలతో..

ప్రభుత్వాల ప్రోత్సాహం లేదు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. అయితే ఈ కష్టాల కడలిని దాటి కుస్తీ పోటీల్లో సత్తా చాటుతున్నాడు 25 ఏళ్ల ప్రకాశ్‌ సింగ్‌. రాజేంద్ర నగర్‌ వట్టినాగులపల్లి లోని నిసిస్తున్న ప్రకాష్ సింగ్ జాతీయ, రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో ఇప్పటివరకు 50కు పైగా పతకాలు సొంతం చేసుకున్నాడు

Follow us
Basha Shek

|

Updated on: Dec 25, 2023 | 4:17 PM

ప్రభుత్వాల ప్రోత్సాహం లేదు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. అయితే ఈ కష్టాల కడలిని దాటి కుస్తీ పోటీల్లో సత్తా చాటుతున్నాడు 25 ఏళ్ల ప్రకాశ్‌ సింగ్‌. రాజేంద్ర నగర్‌ వట్టినాగులపల్లి లోని నిసిస్తున్న ప్రకాష్ సింగ్ జాతీయ, రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో ఇప్పటివరకు 50కు పైగా పతకాలు సొంతం చేసుకున్నాడు. తండ్రి భగవాన్‌ సింగ్‌ అడుగు జాడల్లో నడిచిన అతను తండ్రిలాగే కుస్తీ వీరుడు కావాలని కలలు కున్నాడు. ధృడ సంకల్పం తో కేవలం 13 ఏళ్లకే తన రెజ్లింగ్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. పట్టుదలతో రోజు 8 గంటలకు పైగా కుస్తీ ప్రాక్టీస్ చేశాడు. తన కఠోరశ్రమకు ఫలితంగానే రాష్ట్ర, జాతీయ స్థాయి లో ఎన్నో మెడల్స్ సాధించాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు సుమారు 50కు పైగా పతకాలు సొంతం చేసుకున్నాడీ కుస్తీ వీరుడు. అయితే ఇన్ని పతకాలు సాధించినప్పటికీ తనను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదంటూ వాపోతున్నాడు ప్రకాశ్‌ సింగ్‌. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వమైనా తమకు ప్రోత్సాహం అందజేయాలని కోరుకుంటున్నాడు. తెలంగాణ ప్రభుత్వం తన లాంటి నిరాశ పడ్డ మరెన్నో స్పోర్ట్స్ ప్లేయర్లను గుర్తించి, అంతర్జాతీయ స్థాయి లో వెళ్ళడానికి ముందుకు వచ్చి మద్దతు ఇవ్వాలంటూ ఆకాంక్షిస్తున్నాడు.