నేల మీద పడుకోవడం వలన ఎన్ని లాభాలో తెలుసా?వీడియో
కొంతమంది మంచం ఎంత మృదువుగా ఉన్నా నేలపై పడుకోవడానికి ఇష్టపడతారు. పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా నేలపై హాయిగా నిద్రపోతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వేసవిలో ఎక్కువగా ఇలా నేలపై చాలా మంది నిద్రపోతుంటారు. ఇలా నేలపై పడుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా? ఏదైనా ప్రమాదమా? నిపుణులు ఏమంటున్నారు? నిపుణుల ప్రకారం నేల ఉపరితలం శరీరానికి సహజ శక్తిని అందిస్తుంది. ఈ రకమైన అభ్యాసం వెన్నుముకను బలోపేతం చేయడానికి వెన్నునొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. అదనంగా ఇది శరీరానికి విశ్రాంతిని ఇవ్వడం ద్వారా అలసటను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
నిద్రలేమి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సాధారణంగా మనం నేలపై పడుకున్నప్పుడు మన శరీరం నిటారుగా ఉంటుంది. ఇది శరీరాన్ని సడలించడమే కాకుండా కండరాలను కూడా సడలిస్తుంది. నొప్పి క్రమంగా తగ్గుతుంది. ముఖ్యంగా మట్టి నేలపై పడుకోవడం వల్ల మనసులోని ఆందోళన చింతలు తగ్గిపోతాయి. చెడు ఆలోచనలు మనసులోకి రావు. బంకమట్టి నేలపై పడుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అలాగే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వేసవిలో నేలపై పడుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. అదనంగా గాఢ నిద్రను కూడా తెస్తుంది. మీరు మీ శరీరంలోని వివిధ భాగాలలో నొప్పితో బాధపడుతుంటే నేలపై పడుకోవడం మంచి పరిష్కారం. నేలపై పడుకోవడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ముఖ్యంగా బంకమట్టి నేల ఆరోగ్యానికి మంచిది. మట్టి నేలపై పడుకోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ కొంతమంది గ్రానైట్ మీద పడుకోవడానికి ఇష్టపడతారు. ఇది కొంతమంది శరీరానికి మంచిది కాదు. దీనివల్ల మోకాళ్ల నొప్పులు పాదాలలో వాపు వస్తుంది. అలాంటి అలవాటు శరీర నొప్పిని పెంచుతుంది. కానీ వేసవి రోజుల్లో మట్టి నేలపై పడుకోవడం శరీరానికి చాలా మంచిది.
మరిన్ని వీడియోల కోసం :
డేగాకు పాస్ పోర్ట్.. ఏ దేశం ఇచ్చిందంటే వీడియో
బస్సును ఢీ కొట్టిన బైక్..సీన్ కట్ చేస్తే వీడియో
షాకింగ్ సీక్రెట్.. ఈ పప్పులో నాన్ వెజ్ కంటే అధిక ప్రోటీన్ వీడియో
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
