షాకింగ్ సీక్రెట్.. ఈ పప్పులో నాన్ వెజ్ కంటే అధిక ప్రోటీన్ వీడియో
పెసరపప్పు అంటేనే పోషక విలువలతో నిండి ఉంటుంది. సాధారణంగా మనం చికెన్, మటన్, గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంది అనుకుంటాం. కానీ పెసరపప్పులో కూడా చాలా ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. మాంసాహారాన్ని తినని వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా శాఖాహారులు ఈ పప్పును తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్ ను పొందవచ్చు. ఇందులో ఇంకా ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, విటమిన్ బి సిక్స్ వంటి అవసరమైన పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ శరీరంలో అనేక విధాలుగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఎముకలకు, కండరాలకు బలాన్ని ఇస్తాయి. నాడి వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
పెసరపప్పులో ఉండే ఫైబర్ కూడా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. పెసరపప్పు క్రమం తప్పకుండా తింటే మలబద్ధకం తగ్గి శరీరం హైడ్రేట్ గాను, శుభ్రంగాను ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్ వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది శరీరానికి తగినంత శక్తిని ఇస్తుంది. రక్తహీనత తగ్గుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తనాళాల్లో ఒత్తిడి తగ్గుతుంది. దాంతో రక్త ప్రసరణ సరిగ్గా జరిగి హైపర్ టెన్షన్ సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా వ్యాయామం చేసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పెసరపప్పును ఉప్మా, కిచిడి, పెసరట్టు, పచ్చడి, దోసా వంటి వంటకాల్లో వాడొచ్చు. ఇలా వాడటం వల్ల ఆహారంలో రుచితో పాటు ఆరోగ్యానికి మేలు కూడా కలుగుతుంది. ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వైద్యులను సంప్రదించాలి.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్క లీటరు పాలు రూ. 5 లక్షలు.. ఏమిటా స్పెషాలిటీ వీడియో
కట్నం వద్దు.. వధువే ముద్దు..వీడియో
ఇబ్బందుల్లో నటి.. వన్య ప్రాణుల మాంసం రుచి చూడటం వల్ల వీడియో
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
