Governor Vs Government: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నట్లు అనుమానాలున్నాయి : గవర్నర్..(లైవ్)
తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు గ్యాప్ మరింత పెరగడం, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై పెద్ద రగడే నడుస్తోంది.
రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానం అమలు అవుతుందన్నారు గవర్నర్. రాజ్‌భవన్ ముందు ఆందోళన చేస్తామన్న విద్యార్ధి సంఘాల వెనక ఎవరున్నారని ప్రశ్నించారు. విద్యార్ధి సంఘాలు రాజ్‌భవన్‌కు వచ్చి తమ వినతులు చెప్పుకోవచ్చని అందరికీ తలుపులు తెరిచే ఉంటాయన్నారు. రాజ్‌భవన్ ఎప్పటికీ ప్రగతిభవన్‌లా కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌గా అన్ని పర్యటనలకు సంబంధించిన వివరాలు ముందుగానే ప్రభుత్వానికి ఇచ్చినా ఎందుకు ప్రోటోకాల్ పాటించలేదని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ఇవ్వని కలెక్టర్లు, ఎస్పీలపై నివేదికలు పంపినా ప్రభుత్వం ఏందుకు చర్యలు తీసుకోలేదన్నారు. తీసుకుంటే ఎలాంటి చర్యలు చేపట్టారో చెబుతారా అంటూ నిలదీశారు.
యూనివర్శిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు విషయంలో తనకు అభ్యంతరాలు, అనుమానాలు ఉన్నాయని.. దీనిపై వివరణ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. నెలరోజులకే చాలాకాలంగా రాజ్‌భవన్లో బిల్లు పెండింగ్ పెట్టడం వల్లే రిక్రూట్‌మెంట్ ఆగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు గవర్నర్ తమిళి సై. రాజ్‌భవన్ నుంచి కామన్ రిక్రూట్‌మెంట్ బిల్లుపై వివరణ కోరుతూ లేఖ రాస్తే తనకు అందలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పడంపైనా గవర్నర్ కామెంట్ చేశారు. రాజ్‌భవన్ నుంచే లేఖలు అందుకోలేనంత బిజీగా మంత్రి ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
మరిన్ని వీడియోస్ కోసం: Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..