AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bizarre Gator Like Fish : సముద్ర ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింతజీవి.. మొసలి తల..చేప శరీరం.. వైరల్‌ అవుతున్న ఫోటోలు

ప్రకృతిలో రోజుకో వింత బయల్పడుతూ.. మనిషిని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ప్రకృతి గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తాయి.. తాజాగా సముద్రం నుంచి ఓ వింత జీవీ

Bizarre Gator Like Fish : సముద్ర ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింతజీవి.. మొసలి తల..చేప శరీరం.. వైరల్‌ అవుతున్న ఫోటోలు
Monstrous 'prehistoric' creature
Surya Kala
|

Updated on: Feb 21, 2021 | 12:32 PM

Share

Bizarre Gator Like Fish : ప్రకృతి లో మనకు తెలియని అనేక వింతలు విశేషాలు ఉన్నాయి.. ఇక కోట్లాది జీవరాశుల గురించి మనకు తెలియదు. రోజుకో వింత బయల్పడుతూ.. మనిషిని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ప్రకృతి గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తాయి.. తాజాగా సముద్రం నుంచి ఓ వింత జీవి ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఈ వింత జీవి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పెద్ద దవడలు, పళ్లతో భయానకంగా ఉన్న ఈ జీవి కళేబరాన్ని చూసిన వారు వెంటనే ఫోటోలు తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.

సింగపూర్‌లోని ఓ రిజర్వాయర్ ఒడ్డుకు వచ్చిన ఈ జీవిని  మొదట దూరం నుంచి చేశారు. అనంతరం మొసలిగా భావించి ఒడ్డుకి వచ్చిందనుకుంటూ దగ్గరకు వెళ్లారు. అయితే అది తలభాగం మొసలిలా ఉండగా.. మిగతా శరీరమంతా చేప శరీరంలా ఉంది. దీంతో అది చేపా లేక మొసలా అనేది వారికి అర్థం కాలేదు. కాగా అక్కడి స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.  అక్కడకు చేరుకున్న అధికారులు ఆ వింత జీవిని పరిశీలించి.. అది అత్యంత అరుదైన చేప అని చెప్పారు. అంతేకాదు ఇలాంటి చేపలు పూర్వకాలంలో ఉండేవని చెప్పారు.

ఈ చేపల తల మొసలి తలలా ఉంటుంది. నోట్లో బలమైన దంతాలుంటాయి. ఈ చేప మంచినీటిలో జీవించే అతి పెద్ద చేప అని చెప్పిన అధికారులు.. ఈ జాతి చేపలు ఎక్కువగా దక్షిణ అమెరికా ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. అయితే అమెరికా కి, సింగపూర్ కి 10వేల మైళ్లకు పైగా దూరం. మరి అక్కడ ఉండే చేప… ఇక్కడకు ఎలా వచ్చిందో తెలియదు. దీనిని ఎవరో అక్రమంగా ఇక్కడకు తెచ్చి వదిలి ఉంటారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాగా, స్కాట్‌లాండ్‌కి చెందిన ఒకరు ఈ చేపపై ఓ డాక్యుమెంటరీ తీశారు.

Also Read:

పండు తిన్నదని ఆవును కత్తితో పొడిచి చంపిన వ్యాపారి.. కోపంలో ఆ పనిచేశానంటూ పశ్చాతాపం

: ‘హైలో హైలెస్సా హంస కదా నా పడవ’, బోటెక్కి తెడ్లు వేసిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ