Chetan Success Story: టెంపో డ్రైవర్ కొడుకు నేడు కోటీశ్వరుడు.. క్రికెట్ చూసేందుకు టీవీ లేని స్టేజ్ నుంచి..
సౌరాష్ట్ర రంజీ ఆటగాడు.. ఒకప్పుడు కనీసం క్రికెట్ చూడడానికి ఇంట్లో టీవీ లేకపోతే స్నేహితుల ఇంట్లోలో టీవీలు అమ్మే షోరూం ల్లోనే చూసిన ఈ కుర్రాడు.. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజర్స్ ఆకట్టుకున్నాడు. కష్టాల కడలిని ఎదురీది.. ఈ రోజు తనకంటూ క్రికెట్ ఐపీఎల్ చరిత్రలో...
Tempo Driver Son Chetan Success Story: క్రికెట్ లో సరికొత్త ఒరవడిని సృష్టించిన ఐపీఎల్ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. మట్టిలోని మాణిక్యాలకు భవిష్యత్ నిచ్చింది. జాతీయ క్రికెట్ జట్టులో ఎంట్రీకి దారి చూపించింది ఐపీఎల్.. అంతేకాదు.. ఈ ఐపీఎల్ పుణ్యమాని హార్దిక్ పాండ్యా వంటి వారు ఎంతో మంది క్రికెటర్స్ రాత్రికి రాత్రే కోటీశ్వరులు కూడా అయ్యారు. ఈ కోవలోకే వస్తాడు సౌరాష్ట్ర రంజీ ఆటగాడు.. ఒకప్పుడు కనీసం క్రికెట్ చూడడానికి ఇంట్లో టీవీ లేకపోతే స్నేహితుల ఇంట్లోలో టీవీలు అమ్మే షోరూం ల్లోనే చూసిన ఈ కుర్రాడు.. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజర్స్ ఆకట్టుకున్నాడు. వేలంలో భారీ ధరకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. కష్టాల కడలిని ఎదురీది.. ఈ రోజు తనకంటూ క్రికెట్ ఐపీఎల్ చరిత్రలో ఓ పేజీ లిఖించుకున్న ఆ క్రికెటర్ ఎవరో కాదు.. చేతన్ సకారియా.. అతని జీవిత సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం..!
ఐపీఎల్ 2021 సీజన్ 14 లో వేలం
గురువారం జరిగిన ఐపీఎల్ 2021 సీజన్ 14 లో వేలంలో ఓ టెంపో డ్రైవర్ కొడుకు.. సౌరాష్ట్ర రంజీ ప్లేయర్ చేతన్ సకారియా కూడా భారీ ధర పలికాడు. వేలంలో ఈ లెఫ్టార్మ్ పేసర్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సంతోషాన్ని పంచుకున్నాడు.. ఈరోజు తనకు ఎంతో ఇష్టమైన తమ్ముడు ఉంటె చాలా ఆనందపడేవాడని ఆవేదన వ్యక్తం చేశాడు చేతన్.
చేతన్ 2018-19 రంజీ ట్రోఫీ సీజన్ తో ఎంట్రీ ఇచ్చాడు. సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనద్కత్ గాయపపడడంతో ఆ ప్లేస్ లో చేతన్ రంజీ ట్రోఫీలో అడుగు పెట్టాడు. అడుగు పెట్టిన ఫస్ట్ మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు సాధించిన చేతన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఆ సీజన్ మొత్తంలో సుమారు 30 వికెట్లు తీసాడు.. ఇక బెంగాల్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర విజయంలోనూ చేతన్ కీలక పాత్ర పోషించాడు.
తమ్ముడు మరణం
ఇక కరోనా సమయంలో జాగ్రత్తలు తీసుకుంటూ గతనెలలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరిగిన సంగతి తెలిసిందే.. ఈ ట్రోఫీలో సౌరాష్ట్ర తరపున చేతన్ పాల్గొన్నాడు. అయితే ఆ సమయంలో చేతన్ సోదరుడు రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ విషయం తెలిస్తే ఎక్కడ చేతన్ ఆట మీద ప్రభావం చూపిస్తుందోనని ఇంట్లో వాళ్ళు చెప్పలేదట.. అంతేకాదు టోర్నీ లో ఆడుతున్న సమయంలో రాహుల్ ఎక్కడ అని అడిగితె .. తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లాడని సాకులు చెప్పేవారని .. రాహుల్ మరణం విషయం తెలియనివ్వలేదు. ఇంటికి వెళ్లిన తర్వాతే తన తమ్ముడు చనిపోయిన విషయం తెలిసిందంటూ కన్నీరు పెట్టుకున్నాడు.. ఇప్పుడు రాహుల్ బతికి ఉంటె తనకంటే ఎక్కువ సంతోషించే వాడంటూ చేతన్ భావోద్వేగానికి గురయ్యాడు.
ఐపీఎల్ 13 సీజన్ లోనే
తనకు ఐపీఎల్ 13 సీజన్ సమయంలోనే ఈసారి ఖచ్చితంగా సెలక్ట్ అవుతానని నమ్మకం ఏర్పడిందని చేతన్ చెప్పాడు. యుఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నెట్ బౌలర్ గా సేవలను అందించా.. అప్పుడు ఆ జట్టు కోచ్ మైక్ హెసన్, సైమన్ కటిచ్ లు తనతో మాట్లాడారని.. అప్పుడు వారు తనకు ఏ జట్టుకైనా ఎంపికయ్యే అని అర్హతలు ఉన్నాయని చెప్పారని తెలిపాడు చేతన్. దీంతో ఈ సీజన్ లో ఏ జట్టుకైనా ఎంపికవుతానని నమ్మకంతో ఉన్నా.. వేలంలో తనకోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ప్రయత్నించింది.. అయితే రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఏ జట్టు అయినా తనకు ఒకటే సంతోషమేనని.. తన వంతుగా జట్టు విజయానికి ప్రయత్నిస్తానని చెప్పాడు చేతన్.
ఇల్లు కొనుకుంటా..
తనకు ఇంత డబ్బు వచ్చింది కదా ఎం చేస్తావని చాలా మంది అడుగుతున్నారు.. నేను ఈ డబ్బులో కొంతమొత్తంతో రాజ్‌కోట్‌లో ఇల్లు కొనుకుంటాను.. మా నాన్న ఒక టెంపో వ్యాన్ డ్రైవర్.. మాది చాలా పేద కుటుంబం.. ఎంత పేదరికం అంటే.. గత ఐదేళ్ల క్రితం మా ఇంట్లో టీవీ కూడా లేదు.. ఆ సమయంలో క్రికెట్ చూడాలంటే ఫ్రెండ్స్ ఇంటికో లేక టివి షాప్స్ కో వెళ్లేవాడనని గుర్తు చేసుకున్నాడు. ఏమీ లేని స్టేజ్ నుంచి ఈరోజు రాజస్థాన్ రాయల్స్ కోటి రూపాయలతో కొనుగులో చేయడంతో కోటీశ్వరుడు అయ్యాడు టెంపో డ్రైవర్ తనయుడు చేతన్ సకారియా.. కష్టే ఫలి అనడానికి నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు ఈ కుర్ర క్రికెటర్
Also Read: