INDIA VS ENGLAND 2021: ఇంగ్లాండ్‌తో టీ20 జట్టులోకి సూర్యకుమార్, ఇషాన్ ఇన్.. మరి ఔట్ ఎవరో తెలుసా..!
ఇంగ్లాండ్‌తో జరగనున్న 5 టీ20ల సిరీస్ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఊహించినట్లే సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో చోటు లభించింది. బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్..
IND vs ENG: ఇంగ్లాండ్‌తో జరగనున్న 5 టీ20ల సిరీస్ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఊహించినట్లే సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో చోటు లభించింది. బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్, ఆల్‌రౌండర్ తెవాటియా కూడా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. టీ-20 మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో జరగనున్నాయి. తొలి మ్యాచ్ మార్చి 12న జరగనుంది.
గాయం కారణంగా ఆస్ట్రేలియాతో సిరీస్‌కు దూరమైన పేసర్ భువనేశ్వర్ కుమార్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా టీ-20ల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే పేసర్ బుమ్రాకు విశ్రాంతిని ఇచ్చింది. మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్‌లకు మొడిచెయ్యి మిగిలింది.
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. దేశవాళీల్లోనూ ముంబై జట్టులో మంచి స్కోరు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడిని జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు సూర్యకుమార్.
ఇక ఇషాన్ కిషన్ కూడా ముంబై తరఫున గతేడాది ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించాడు. రాహుల్ తెవాటియా.. రాజస్థాన్ తరఫున ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. వీరంతా ఈ సారి మొతేరా స్టేడియంలో మంచి ప్రదర్శ చేస్తారాని బీసీసీఐ ఆశిస్తోంది.
జట్టు సభ్యులు : విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హర్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, చాహల్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాతియా, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, నవదీప్ సైని, శార్దూల్ ఠాకూర్.
ఇవి కూడా చదవండి..
Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ . 411 జమ చేయడం.. ఆ తర్వాత రూ .43.60 లక్షలు పొందండి..