మళ్లీ ప్రేమలో పడ్డ లలిత్‌మోదీ.. ఆమె ఎవరంటే..
క్రికెట్ గురించి తెలిసిన వాళ్లకి లలిత్ మోదీ పేరు గుర్తుండే ఉంటుంది. ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ 61 ఏళ్ల లలిత్ మోదీ మళ్లీ ప్రేమలో పడ్డారు. వాలంటైన్స్ డే నాడు తన కొత్త ప్రేయసి రీమా బౌరీని నెటిజన్లకు పరిచయం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పాతికేళ్ల స్నేహం ఇప్పుడు ప్రేమ బంధంగా మారిందంటూ సినిమాటిక్ స్టయిల్‌లో కోట్ చేశారు.
అదృష్టం ఒక్కసారే వరిస్తుందని కానీ తనకు రెండుసార్లు వరించిందనీ, 25 సంవత్సరాల స్నేహం ఇప్పుడు ప్రేమగా మారిందనీ ఇలా అందరి జీవితాల్లో జరగాలని కోరుకుంటున్నాననీ మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కి ఓ వీడియోని కూడా జోడించారు. తన ప్రియురాలితో కలిసి ఉన్న అపురూప క్షణాలు ఆ వీడియోలో ఉన్నాయి. పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌లో కేసులో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీ 2010 నుంచి లండన్‌లో ఉంటున్నారు. మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తో డేటింగ్‌లో ఉన్నట్లు 2022 జులైలో ప్రకటించి సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఆమెను పెళ్లి చేసుకోలేదని, భవిష్యత్‌లో చేసుకునే అవకాశముందంటూ అప్పట్లో కామెంట్ చేసారు. ఆమెతో దిగిన ఫొటోలు కూడా పంచుకున్నారు. సుస్మితా సేన్ మాత్రం ఈ ప్రేమ వ్యవహారం గురించి ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. లలిత్ మోదీ ప్రకటన తర్వాత తనపై వచ్చిన విమర్శల గురించి మాత్రమే ఆమె ఓ సందర్భంలో మాట్లాడారు. విమర్శలను తాను పెద్దగా పట్టించుకోననీ ఎందుకంటే, ఇది తన జీవితం అన్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను అందరితో చెప్పాల్సిన అవసరం లేదు అని ఆమె బదులిచ్చారు. లలిత్ మోదీకి గతంలోనే వివాహమైంది. ఆయన సతీమణి మిలాన్ మోదీ 2018లో క్యాన్సర్‌తో కన్నుమూశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహాకుంభమేళాలో హెలికాఫ్టర్ సేవలు.. టికెట్ ధర ఎంతంటే ??
దారుణం.. కోడలికి హెచ్‌ఐవీ వైరస్ ఉన్న ఇంజెక్షన్ ఇచ్చి
మీ వయసును తగ్గించే ఆహారాలు ఇవే.. మీ ముఖంలో ఎప్పటికీ యవ్వనపు మెరుపు
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

