AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుమారీ ఆంటీ పూజ గదిలో ఎవరి ఫోటో ఉందో తెలుసా..? ఫుడ్ స్టాల్ తెరిచే ముందు నిత్యపూజలు..!

మహిళా సాధికారతకు కుమారి ఆంటీ బెస్ట్ ఎగ్జాంపుల్. హైదరాబాద్‌ మాదాపూర్‌ ఐటీసీ కోహినూర్ సమీపంలో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ కుమారి ఆంటీ చాలా ఫేమస్ అయ్యారు. దాదాపు 15 ఏళ్ల క్రితం స్ట్రీట్ ఫుడ్ అమ్మడం ప్రారంభించిన కుమారి ఆంటీ నేడు చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో పడ్డారు.

కుమారీ ఆంటీ పూజ గదిలో ఎవరి ఫోటో ఉందో తెలుసా..? ఫుడ్ స్టాల్ తెరిచే ముందు నిత్యపూజలు..!
Kumari Aunty
Ranjith Muppidi
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 19, 2025 | 8:00 PM

Share

కుమారీ ఆంటీని తెలుగు జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తొలుత మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ సమీపంలో పెట్టిన ఫుడ్ స్టాల్ ద్వారా ఆమె పాపులర్ అయ్యారు. వెజ్, నాన్ వెజ్ భోజనాలను సరసమైన ధరలకే అందిస్తూ ఉండటంతో.. ఆమె వద్దకు స్థానికులతో పాటు ఫుడ్ లవర్స్ క్యూ కట్టారు. ఇక ఫుడ్ వ్లాగర్స్, యూట్యూబ్ వాళ్లు సందడి కూడా అక్కడ పెరిగిపోవడంతో.. స్థానికంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో స్టాల్ తీసేయాలని పోలీసులు సూచించారు. ఈ అంశం అప్పట్లో నెట్టింట దుమారం రేపింది. ఆమె తన పొట్ట కొట్టారంటూ బాధను వ్యక్తపరచడంతో విషయం సీఎం రేవంత్ దాకా వెళ్లింది.

కుమారి స్ట్రీట్ ఫుడ్ స్టాల్‌ను తీయకుండా.. ఆమెను ఇబ్బంది పెట్టకుండా.. ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. దీంతో కుమారీ ఆంటీ సీఎం రేవంత్‌కు రుణపడి ఉంటానని చెప్పారు. ఆ తర్వాతి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళం అందజేశారు. తాజాగా కుమారీ ఆంటీ మరోసారి వార్తల్లోకి వచ్చింది.

ఈసారి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను తాను పూజించే దేవుళ్ల గదిలో పెట్టుకుంది కుమారి ఆంటీ. సీఎం రేవంత్‌కు నిత్యం పూజలు చేయడం హాట్ టాపిక్ అయింది. తన ఫుడ్ స్టాల్ ఈరోజు ఉందంటే, తక్కువ ధరలో మంచిగా కడుపు నిండా అన్నం పెడుతున్నానంటే.. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని కుమారి అంటీ చెబుతున్నారు. అందుకు తనకు ఆయన దైవంలాంటి వారని వెల్లడించారు. ప్రతిరోజు తన దేవుళ్లతో పాటు, రేవంత్ ఫోటోకు కూడా దండం పెట్టుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తానని కుమారీ ఆంటీ చెప్పడం విశేషం..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా