TOP9 ET : ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్.. దద్దరిల్లిపోవడం పక్కా!
ఒలింపిక్స్ వేడుకలు పారిస్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సీన్ నది ఒడ్డున నిర్వహించింది పారిస్. తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో రూపకల్పన చేసింది. ఈ వేడుకలు చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా
ఒలింపిక్స్ వేడుకలు పారిస్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సీన్ నది ఒడ్డున నిర్వహించింది పారిస్. తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో రూపకల్పన చేసింది. ఈ వేడుకలు చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు, సినీ తారలు వెళ్లారు. పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి సైతం వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. సతీమణి సురేఖ, కోడలు ఉపాసన, మనవరాలు క్లీంకారతో పారిస్ వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఒలింపిక్స్ జ్యోతిని పట్టుకున్న ఆసక్తికర ఫొటోని ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు. పారిస్ వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు చిరంజీవి. సురేఖతో కలిసి ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకోవడం ఆనందకరమైన క్షణమన్నారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు చిరంజీవి. పతకాలు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
వర్క్ లైఫ్ నుంచి కాస్త విరామం తీసుకున్న చిరంజీవి, రామ్‌చరణ్ ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్‌కు వెళ్లారు. అక్కడ ఫ్యామిలీతో తన విలువైన సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు. ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను కూడా చిరంజీవి ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. పారిస్ టూర్‌కి సంబంధించిన పలు ఫొటోలను ఉపాసన సైతం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అవి నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరలో నటిస్తున్నారు. ఇక రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్‌ఛేంజర్‌లో నటిస్తున్నారు.