Ranbir Kapoor – PM Modi: ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
వ్యాపారవేత్త నిఖిల్ కామత్‌తో ఇటీవల జరిగిన పోడ్‌కాస్ట్‌లో, ప్రధాన మోదీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్. తాను రాజకీయాల గురించి ఆలోచించడం చాలా తక్కువ అని.. కానీ ప్రధాని మోదీని ఎంతగానో ఆరాధిస్తానని చెప్పుకొచ్చాడు రణబీర్.

రణబీర్ మాట్లాడుతూ ‘నేను రాజకీయాల గురించి పెద్దగా ఆలోచించను. ఐదేళ్ల క్రితం మేమంతా(నటీనటులు, దర్శకులు) ప్రధాని మోదీని కలిసేందుకు వెళ్లాం. అప్పటిదాకా ఆయన్ని టెలివిజన్‌లో మాత్రమే చూశాం. ఆయనొక గొప్ప వక్త. ప్రధాని మోదీలో ఓ అయస్కాంత ఆకర్షణ ఉంది. ఆ సమయంలో ఆయన ప్రతీ వ్యక్తి దగ్గరకు వచ్చి.. వారి యోగక్షేమాలు, అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితుల గురించి కనుక్కున్నారు. మా నాన్నగారు ఆ సమయంలో ట్రీట్‌మెంట్‌కి వెళ్తుండేవారు. కాబట్టి ఆయన ట్రీట్‌మెంట్ ఎలా జరుగుతోంది.? ఎంతవరకు వచ్చింది.? అని ప్రతీ విషయం అడిగి తెలుసుకున్నారు. ఇలా ఆయన అలియాతో ఇంకేదో, విక్కీ కౌశల్‌తో మరేదో, కరణ్ జోహార్‌తో ఇంకేదో మాట్లాడారు. ప్రతిదీ చాలా పర్సనల్’ అని పేర్కొన్నాడు. ఉన్నత వ్యక్తులకే ఇలాంటి గొప్ప గుణాలు ఉంటాయి. తామే కాదు.. తమతో ఉండే ప్రతీవారు సంతోషంగా ఉండాలనుకునే వ్యక్తీ ప్రధాని మోదీ. ప్రధాని మోదీలా షారూఖ్ ఖాన్ కూడా అలాంటి ఉన్నత వ్యక్తుల్లో ఒకరని రణబీర్ కపూర్ అన్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి