Sundeep Kishan: నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్.! టాలీవుడ్ హీరో మంచి మనసు.

Sundeep Kishan: నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్.! టాలీవుడ్ హీరో మంచి మనసు.

Anil kumar poka

|

Updated on: Jul 28, 2024 | 4:36 PM

చాలా మంది సినీ సెలబ్రిటీలు ఓ వైపు కోట్ల రూపాయలు సంపాదిస్తూనే మరోవైపు ఏదో ఒకరంగా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఎంతో మందిని ఆదుకుంటుంటారు. అయితే వీరిలో కొంత మంది దీని గురించి చెప్పుకుంటారు. మరికొంతమంది చెప్పుకోరు. తాజాగా హీరో సందీప్ కిషన్ చాలా కాలంగా తాను చేస్తున్న ఓ మంచి పని గురించి అనుకోకుండా మీడియా ముందు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం బయట చక్కర్లు కొడుతోంది.

చాలా మంది సినీ సెలబ్రిటీలు ఓ వైపు కోట్ల రూపాయలు సంపాదిస్తూనే మరోవైపు ఏదో ఒకరంగా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఎంతో మందిని ఆదుకుంటుంటారు. అయితే వీరిలో కొంత మంది దీని గురించి చెప్పుకుంటారు. మరికొంతమంది చెప్పుకోరు. తాజాగా హీరో సందీప్ కిషన్ చాలా కాలంగా తాను చేస్తున్న ఓ మంచి పని గురించి అనుకోకుండా మీడియా ముందు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం బయట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సందీప్ కిషన్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్​ నటించిన రాయన్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. దీని రిలీజ్ డేట్ జూలై 26. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్​లో భాగంగా సందీప్ కిషన్ తాను చేసే మంచి పని గురించి మాట్లాడారు.

సందీప్ కిషన్​కు రెస్టారెంట్స్ ఉన్నాయి. రీసెంట్​గా ఆయన రెస్టారెంట్​లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్ జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఈ విషయమై తాజా మూవీ ప్రమోషన్స్​లో ఆయనకు ప్రశ్న ఎదురైంది. అప్పుడు సందీప్ మాట్లాడుతూ తాను ఈ రెస్టారెంట్ల ద్వారా ప్రతిరోజు ఉచితంగా 350 మందికి ఫుడ్ డొనేట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఆశ్రమాలకు, పేదలకు తాను ఈ రెస్టారెంట్ ద్వారా ఆహారం పంచుతున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజు తనకున్న ఏడింటిలో ప్రతి బ్రాంచ్ నుంచి 50 మందికి అంటే రోజుకు 350 మందికి ఉచితంగా భోజనం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అలా దాదాపు నెలకు నాలుగున్నర లక్షల విలువ చేసే ఆహారాన్ని ఫ్రీగా పంచి పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అలానే అన్న క్యాంటీన్స్ తరహాలో తక్కువ ధరకే క్యాంటీన్స్ పెట్టాలనే ఆలోచన కూడా ఉన్నట్టు, ప్రస్తుతం దాని గురించి వర్క్​ చేస్తున్నట్టు చెప్పారు సందీప్ కిషన్. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న సినీ ప్రియులు, అభిమానులు, ప్రజలు సందీప్ కిషన్ చేస్తున్న మంచి పనిని అభినందిస్తున్నారు. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.