కస్టమర్‏కు షాక్ ఇచ్చిన డెలివరీ బాయ్.. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్‏ను తీసుకొచ్చి తినేశాడు.. వీడియో వైరల్..

ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‏కు డెలివరీ బాయ్ షాకిచ్చాడు. ఫుడ్‏ను ఇంటివరకు తీసుకువచ్చి.. అ తర్వాత క్యాన్సిల్ చేసేశాడు. ఇక

కస్టమర్‏కు షాక్ ఇచ్చిన డెలివరీ బాయ్.. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్‏ను తీసుకొచ్చి తినేశాడు.. వీడియో వైరల్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 21, 2021 | 5:58 PM

ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‏కు డెలివరీ బాయ్ షాకిచ్చాడు. ఫుడ్‏ను ఇంటివరకు తీసుకువచ్చి.. అ తర్వాత క్యాన్సిల్ చేసేశాడు. ఇక అనంతరం తెచ్చిన ఫుడ్‏ను తనే అక్కడే ఉండి తినేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది.

లండన్‏లోని కెంటిష్ టౌన్‏లో ఓ మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది. ఇటీవల మెక్‏డొనాల్డ్‏లో బర్గర్‏కు ఆమె ఆన్‏లైన్లో ఆర్డర్ చేసింది. అయితే ఆ సంస్థకు చెందిన ఫుడ్ డెలివరీ బాయ్ ఆ ఫుడ్ తీసుకొని నేరుగా ఆమె ఇంటికి వచ్చాడు. కానీ అది ఆమెకు ఇవ్వకుండా ఆర్డర్‏ను క్యానిల్ చేశాడు. ఇక అక్కడే ఇంటిబయట ఉండి దానిని తినేశాడు. ఈ ఘటన మొత్తాన్ని ఆమె తన ఫోన్‏లో రికార్డ్ చేయగా.. దానిని ఆమె సోదరుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక ఈ ఫన్నీ వీడియోకు ఇప్పుడే తిన్నా అనే క్యాప్షన్ కూడా జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‏గా మారగా… ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Pune Restaurant: భోజనం చేయండి… బుల్లెట్‌ బైక్‌ సొంతం చేసుకోండి.. స్పెషల్‌ ఆఫర్‌ ప్రకటించిన రెస్టారెంట్‌..