Viral News: చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి.. చితికి నిప్పంటిస్తుండగా కళ్లు తెరిచిన వృద్ధుడు!

ఓ వృద్ధుడు మృత్యువును తాకి తిరిగి వచ్చారు. వృద్ధుడు చనిపోయాడని భావించి అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్తున్నారు. చనిపోయిన వ్యక్తిని చితిపైకి చేర్చారు. చివరిసారిగా అతనికి గంగా జలాన్ని నోట్లో పోయాడంతో ఒక్కసారిగా లేచి కూర్చుకున్నాడు.

Viral News: చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి.. చితికి నిప్పంటిస్తుండగా కళ్లు తెరిచిన వృద్ధుడు!
Dead Man
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 28, 2021 | 11:01 AM

Delhi Dead Man stand up: ఓ వృద్ధుడు మృత్యువును తాకి తిరిగి వచ్చారు. వృద్ధుడు చనిపోయాడని భావించి అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్తున్నారు. చనిపోయిన వ్యక్తిని చితిపైకి చేర్చారు. చివరిసారిగా అతనికి గంగా జలాన్ని నోట్లో పోయాడంతో ఒక్కసారిగా లేచి కూర్చుకున్నాడు. ఈ హఠాత్తు పరిణామంతో బంధుమిత్రులంతా అవాక్కయ్యారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. సతీష్ భరద్వాజ్ అనే వ్యక్తి మరణవార్త కుటుంబ సభ్యులందరినీ శోకసంద్రంలో ముంచెత్తింది. బంధుమిత్రులలందరికీ సమాచారం అందించారు. మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువచ్చారు. అయితే మృతదేహనికి నిప్పంటించే ముందు.. చితిపై చనిపోయిన వ్యక్తి సజీవంగా ఉన్నాడు.

ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఆదివారం ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చనిపోయిన వ్యక్తి శ్మశాన వాటిక నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం, తిక్రీ ఖుర్ద్ గ్రామానికి చెందిన 62 ఏళ్ల పెద్ద సతీష్ భరద్వాజ్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. క్యాన్సర్ కారణంగా ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. వెంటిలేటర్‌పై ఖర్చు ఎక్కువ కావడంతో కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. సోమవారం ఇంటికి తీసుకెళ్లగా వృద్ధుడు మృతి చెందినట్లు కుటుంబీకులు భావించారు. అనంతరం ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు ప్రారంభించారు. సన్నాహకాలు పూర్తి చేసి శ్మశాన వాటికకు తీసుకొచ్చేసరికి వృద్ధుడి ముఖంలో ఏదో కదలిక రావడం, మెల్లగా కళ్లు తెరిచి చూడడం కొందరు చూశారు. శవానికి నిప్పంటించే ముందు అతని ముఖంపై ఉన్న ముసుగు తొలగించి, నోట్లో తులసి తీర్థంగా గంగా జలాలను పోశారు కుటుంబసభ్యులు. అంతే ఆ వృద్ధుడు చితిపై ఉన్న శవం అటు ఇటు కదలడంతో అందరు అశ్చర్యానికి గురయ్యారు. వృద్ధులు ఊపిరి పీల్చుకుంటున్నారని, వారు నెమ్మదిగా కళ్లు తెరుస్తున్నారని పేర్కొన్నారు.

అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, వృద్ధుడు సజీవంగా కనిపించాడు. ఆ తర్వాత అంబులెన్స్‌కు కాల్ చేసి ఆసుపత్రిలో చేర్చారు.ఆసుపత్రికి చేరుకున్న వృద్ధుడు అకస్మాత్తుగా కళ్లు తెరిచాడు. ఆసుపత్రిలో పరీక్షించగా, రక్తపోటు సాధారణంగా ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా, గుండె కొట్టుకోవడం, పల్స్ రేటు కూడా సాధారణంగా ఉన్నాయి. ముందుజాగ్రత్త చర్యగా ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన వైద్యులు, అక్కడ చికిత్స అందిస్తున్నారు.

Read Also…  Kidney Failure: మూత్రంలో సమస్యతోపాటు ఈ లక్షణాలుంటే.. కిడ్నీ ఫెయిల్యూర్‌‌కు దారి తీసినట్లే..

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..