బంగారం కొనే ఆలోచన ఉందా ?? అయితే ఈ వీడియో చూడండి
బంగారం కొనాలనుకుంటున్నారా... అయితే మీ ఆలోచనను వాయిదా వేసుకోండి. ఎందుకంటే బంగారం రేటు రోజు రోజుకీ పెరుగుతున్న విషయం మీకు తెలిసిందే. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో గోల్డ్ కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి.
నానాటికి సరికొత్త రికార్డులను తిరగరాస్తూ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారంతో పాటు.. సిల్వర్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తాజాగా.. బంగారం తులం ధర లక్షా 25వేల మార్క్ దాటింది. వెండి కేజీ ధర ఏకంగా లక్షా 85 వేల మార్క్ దాటింది. సోమవారం, బంగారం, వెండి ధరలు అదే జోరుతో ట్రేడవుతున్నాయి. సోమవారం ఉదయం దేశీయంగా నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.320 మేర ధర పెరిగి.. రూ.1,25,400 కి చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్ పై రూ.300లు పెరిగి రూ.1,14,950 కి చేరుకుంది. వెండి కిలో ధర రూ.5000 పెరిగి.. రూ.1,85,000 లకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,25,550 లు పలుకుతోంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,100 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,730లు, 22 క్యారట్ల బంగారం ధర రూ.1,15,250 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 పెరిగి రూ.1,25,400 పలుకుతోంది. 22 క్యారట్ల బంగారం ధర రూ.300 పెరిగి రూ.1,14,950 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,400గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,950 పలుకుతోంది. ఈ ధరలు ఉదయం పదిన్నర గంటలకు నమోదైనవి. సాయంత్రానికి ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు. కనుక బంగారం కొనేందుకు వెళ్లేముందు మరోసారి ధరలు చెక్ చేసుకొని వెళ్లడం మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సొంత కూతురిని కిడ్నాప్ చేసిన తండ్రి.. వీడియో వైరల్
వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవ వైభవం.. చూసి తీరాల్సిందే!
5.8 కిలోల బరువుతో శిశువు జననం.. వైరల్‌గా వీడియో
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

