AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవ వైభవం.. చూసి తీరాల్సిందే!

వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవ వైభవం.. చూసి తీరాల్సిందే!

Phani CH
|

Updated on: Oct 13, 2025 | 6:59 PM

Share

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని వెంకటేశ్వర ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగుతోంది. 13వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయానికి భక్తజనం పోటెత్తారు. ఈనెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి తిరువీధుల్లో ఏడు ప్రదక్షిణాలు నిర్వహించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు..

అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవ పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు… మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య అందిస్తారు.. గౌతమి గోదావరి తీరాన ఉన్న వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా విరజల్లుతోంది…. ఒకనాడు వీధి దీపాలకు కూడా నోచుకోని ఈ గ్రామం స్వామివారి మహిమతో వీధి దీపాలు లేని గుడికి దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు రావడం స్వామివారి మహిమను చాటుతోంది….. ఏడు వారాలు… ఏడు ప్రదక్షిణలు నోములతో ఇక్కడి చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా విస్తృత మహిమామృతమైన ప్రచారంలో ఉన్నారు. అంతేకాదు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి తరువాత అంతటి భక్తుల ఆదరణ కలిగిన రెండో అతిపెద్ద దేవాలయంగా ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం విరాజిల్లుతోంది. వారంలోని అన్ని రోజులు స్వామివారి ఆలయానికి 30 వేలకు తగ్గకుండా భక్తులు వస్తుంటే.. ఒక్క శనివారం మాత్రం 70 వేల నుంచి 90 వేల వరకు భక్తులు విశేష సంఖ్యలో విచ్చేయడం ఇక్కడి స్వామివారి గొప్పతనాన్ని చాటి చెబుతుంది. ఆలయ ఉప కమిషనర్ సూర్య చక్రధర్ రావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.. ఒకపక్క నిత్యం స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు…మరోపక్క బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు వచ్చే భక్తుల తాకిడితో వాడపల్లి గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. తిరుమాడ వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి… ఆలయ ప్రాంగణంలో కేరళ వాయిద్యాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి… ఆలయ ప్రాంగణంలో శంఖ, చక్ర నామాలతో ఏర్పాటు చేసిన ఫోటో సూట్ వద్ద భక్తుల సందడి నెలకొంది…మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య అందిస్తారు. వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న 13వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు పాటు ప్రతిరోజు ఉదయం స్వామి వారి వసంత మండపంలో ఫల పుష్పాలతో అలంకరిస్తున్నారు. రోజూ సాయంత్రం స్వామివారిని వివిధ అలంకరణలతో హంస, హనుమ, సింహ, గరుడ, చంద్ర ప్రభ, సూర్య ప్రభ, గజ, అశ్వ వాహనాల మీద స్వామిని ఊరేగిస్తారు. 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎన్నడూ లేని విధంగా ఆలయ ప్రాంగణంలో చేసిన ప్రత్యేక ఏర్పాట్లు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఆలయంలో వివిధ రకాల పండ్లతో, పూలతో చేసిన ప్రత్యేక అలంకరణలు చూసి భక్తులు ఆశ్చర్య పోతున్నారు. ఆలయం మాడవీధులు, ప్రధాన వీధులు విద్యుత్ కాంతులతో శోభిలుతున్నాయి. కోనసీమ వెంకటేశ్వర స్వామికి ఘన చరిత్ర ఉంది. ఎర్రచందన స్వరూపుడిగా ఒక చెక్క పెట్టెలో గౌతమి నది తీరాన ఉన్న వాడపల్లికి కొట్టుకువచ్చిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని వాడపల్లిలో ప్రతిష్టించిన నాటి భక్తులు.. ప్రత్యేక పూజలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్వామివారి విగ్రహం ఎర్రచందనపు చెక్కతో ఉంటుంది. వాడపల్లికి ఒక తెలుగు రాష్ట్రాలే కాదు మహారాష్ట్ర కర్ణాటక బెంగళూరు విదేశాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం విశేషం…. భక్తులకు నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

5.8 కిలోల బరువుతో శిశువు జననం.. వైరల్‌గా వీడియో

తులం బంగారం రూ.3 లక్షలు కానుందా

అమెరికాలో విదేశీ విద్యార్థుల పార్ట్ టైం ఆదాయం పైనా పన్ను

పాడుబడ్డ భవనంపై డ్రోన్ ఎగరేసిన పోలీసులు.. లోపలి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ??

వానపాము అనుకున్నారా ?? కాదు..ఇది నిజం పామే