5.8 కిలోల బరువుతో శిశువు జననం.. వైరల్‌గా వీడియో
బాల భీముడి ఆకారంతో అమెరికాలో ‘జంబో బేబీ బాయ్’ పుట్టిన ఘటన డాక్టర్లను, వైద్య నిపుణులను ఆశ్చర్యపర్చింది. టెన్నెస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్లేకు చెందిన షెల్బీ మార్టిన్ అనే మహిళ.. 5.8 కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది. దీంతో.. ఆ బాలుడు జన్మించిన ‘ట్రైస్టార్ సెంటినియల్ వుమెన్స్ హాస్పిటల్’ పేరు నెట్టింట వైరల్ అవుతోంది.
సీ సెక్షన్ ద్వారా ప్రసవం చేసిన వైద్యులు అనంతరం తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. భారీ ఆకారం, 5.8 కేజీల బరువుతో పుట్టిన శిశువుకి, తల్లికి కాంప్లికేషన్లు తలెత్తకుండా అవసరమైన మద్దతు అందించారు. షెల్బీ మార్టిన్ ప్రెగ్నెన్సీ సమయంలో..భారీ ఆకారంతో ఉన్న తన ‘బేబీ బంప్’ను టిక్ టాక్ వీడియోలో పంచుకున్నప్పుడే ఆ వార్త సంచలనంగా మారింది. గతంలో ఆమె బేబీ బంప్ తాలూకూ వీడియోలను 44 లక్షలమంది చూసారు. చాలా మంది యూజర్లు అంత పెద్ద బేబీ బంప్ చూసి.. ఆమె ఫేక్ వీడియోలు పెడుతుందని భావించారు. అయినా.. షెల్లీ మాత్రం.. దాదాపు 9 నెలలకుపైగా ‘బేబీ బంప్’తో ఆమె ఎదుర్కొన్న అనుభవాలపై వీడియోలుగా తీసి పోస్ట్ చేసారు. అసాధారణమైన శిశు జననాల్లో సవాళ్లను అర్థం చేసుకునేందుకు ఆమె చెప్పిన విషయాలు వైద్యులకు దోహదపడ్డాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తులం బంగారం రూ.3 లక్షలు కానుందా
అమెరికాలో విదేశీ విద్యార్థుల పార్ట్ టైం ఆదాయం పైనా పన్ను
పాడుబడ్డ భవనంపై డ్రోన్ ఎగరేసిన పోలీసులు.. లోపలి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ??
అయ్యో.. ఇలాంటి కష్టం ఏ రైతుకీ రాకూడదు!
సబ్ రిజిస్ట్రార్కే కుచ్చు టోపీ పెట్టారుగా
అందం ఎరగా వేసి అమ్మాయిలతో న్యూడ్ కాల్స్.. ఆ తర్వాత
డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు
లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో
ఆ ఊరి కుక్కలన్నీ వారికి నేస్తాలే.. శునకాల సేవలో ఆధ్యాత్మిక ఆనందం
వీడసలు టీచరేనా.. విద్యార్థినిని ఏమార్చి.. అలా ఎలా చేసాడు

