తులం బంగారం రూ.3 లక్షలు కానుందా
అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, రాజకీయ- భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఔన్సుకు 4 వేల డాలర్ల మార్కును అధిగమించగా.. దేశీయంగా 24 కేరట్ల తులం బంగారం ధర రూ. 1.25 వేలు దాటింది. అయితే, మారుతున్న అంతర్జాతీ పరిస్థితుల వల్ల.. 2028 నాటికి ఔన్స్ గోల్డ్ రేటు ఏకంగా 10 వేల డాలర్లు దాటొచ్చని, అదే జరిగితే..మన దేశంలో బంగారం ధర రూ.3 లక్షలు దాటినా ఆశ్చర్యం లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ సంవత్సరం బంగారం ధరలు ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో పెరిగాయి. ఔన్సు బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల 4 వేల డాలర్ల మార్కును దాటి ట్రేడయింది. ఈ ఏడాదిలో ఇప్పటికే బంగారం ధర సుమారు 50 శాతానికిపైగా పెరగ్గా.. ఇక రివర్స్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందని, క్రమంగా బంగారం ధరలు దిగివస్తాయని కొన్నాళ్లుగా అందరూ భావిస్తూ వచ్చారు. అయితే.. ఇక్కడే మరో షాకింగ్ రిపోర్ట్ బయటికి వచ్చింది. అయితే.. బంగారం రేట్లు మున్ముందు ఇంకా భారీగా పెరిగే అవకాశమే ఎక్కువని ప్రముఖ మార్కెట్ నిపుణుడు ఎడ్ యార్డనీ ప్రకటించారు. ద్రవ్యోల్బణం సహా ప్రపంచ అనిశ్చితి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధర మరింత పెరుగుతుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే..2028 చివరి నాటికి లేదా 2029 ప్రారంభం నాటికి ఔన్స్ బంగారం ధర 10 వేల డాలర్ల మార్కును దాటొచ్చని యార్డెనీ భావిస్తున్నారు. ఇదే భారత కరెన్సీలో చూస్తే ఔన్సుకు 8.90 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇది ఇప్పటి పెరుగుదల కంటే దాదాపు 150 శాతం ఎక్కువ. ఎడ్ యార్డెనీ లెక్కల ప్రకారం చూస్తే.. భారతదేశంలో తులం బంగారం ధర 2028 కల్లా ఏకంగా రూ. 3 లక్షల వరకు చేరుతుందని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికాలో విదేశీ విద్యార్థుల పార్ట్ టైం ఆదాయం పైనా పన్ను
పాడుబడ్డ భవనంపై డ్రోన్ ఎగరేసిన పోలీసులు.. లోపలి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ??
వానపాము అనుకున్నారా ?? కాదు..ఇది నిజం పామే
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

