దీపావళికి 9 రోజులు సెలవులు.. ఇక పండగే పండగ
కార్పొరేట్ కంపెనీల్లో ఉండే పని ఒత్తిడి గురించి తెలియంది కాదు. టార్గెట్లు, డెడ్‌లైన్లు ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అక్కడి వర్క్ కల్చర్‌కి ఉద్యోగులు నలిగిపోతుంటారు. అయితే ఢిల్లీలోని ‘ఎలైట్ మార్క్’ అనే PR సంస్థ మాత్రం ఇందుకు భిన్నంగా ఉద్యోగులకు వరాల వర్షం కురిపించింది. సాధారణంగా దీపావళి గిఫ్ట్ కింద.. ఉద్యోగులకు బోనస్, స్వీట్లు, వస్తువులకు బదులు ఉద్యోగుల ఉల్లాసం కోసం వినూత్న నిర్ణయం తీసుకుంది.
పండుగకు ఏకంగా 9 రోజులు సెలవులు ప్రకటిస్తూ..సంస్థ సీఈవో ఉద్యోగులకు ఈమెయిల్ పంపించారు. ఈ నిర్ణయానికి ఆశ్చర్యంలో మునిగిపోయిన ఉద్యోగుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఈ సెలవుల ముచ్చటను.. కంపెనీ హెచ్‌ఆర్ టీం.. లింక్డిన్ ఇన్‌లో పోస్ట్ చేశారు. దీంతో .. ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయి.. మీడియా హెడ్‌లైన్ గా మారింది. కంపెనీ సీఈవో రజత్ గ్రోవర్ తన మెయిల్‌లో ఉద్యోగులకు ప్రత్యేక సందేశం పంపారు. ఈమెయిల్‌లో గ్రోవర్, ‘అక్టోబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు మొత్తం 9 రోజుల విరామాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయండి. అధికారిక ఈమెయిల్‌ల నుంచి స్విచ్ ఆఫ్ అవ్వండి, నిద్రను ఆస్వాదించండి , కుటుంబాలతో లేట్-నైట్ పార్టీలు చేసుకోండి , స్వీట్స్‌ను ఎంజాయ్ చేయండి’ అని రాశారు. ఈ సెలవులు న్యూ జాయినర్లు, సీనియర్ లీడర్లు, ఇంటర్న్‌లు, HR టీమ్‌తో సహా అందరు ఉద్యోగులకు వర్తిస్తుందని తన మెయిల్‌లో తెలిపారు. ఈ ప్రకటన HR టీమ్‌ను కూడా సర్ప్రైజ్ చేసింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘మా ఉద్యోగుల కష్టానికి, అంకితభావానికి విలువ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. దీపావళిఅనేది కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ. పని నుంచి పూర్తి విరామం లభిస్తేనే వారు మరింత ఉల్లాసంగా, కొత్త శక్తితో తిరిగి పనిలోకి రాగలుగుతారు. అందుకే ‘నో ఈమెయిల్ పాలసీ’ని అమలు చేస్తున్నాం’ అని తెలిపారు.సాధారణంగా సెలవుల్లో కూడా ఈమెయిల్స్, ఆఫీసు సందేశాల కారణంగా ఒత్తిడికి గురయ్యే ఉద్యోగులు, ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై Elite Marque ఉద్యోగి ఒకరు లింక్డిన్‌లో పోస్ట్ చేశారు. ‘చాలామంది వర్క్‌ప్లేస్ , వర్క్ కల్చర్ గురించి పెద్దపెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. కానీ..నిజానికి జెన్యూన్ వర్క్ కల్చర్‌ను పట్టించుకోరు. కానీ.. మా కుటుంబాలతో పండుగ జరుపుకోవడానికి టైమ్ ఆఫ్ ఇచ్చిన ఫర్మ్‌ను, CEO రాజత్ గ్రోవర్‌ను ప్రశంసిస్తున్నా. ఉద్యోగుల నిజమైన సంక్షేమం గురించి ఆలోచించే ఈ సంస్థలో పనిచేయటాన్ని గౌరవంగా భావిస్తున్నా ’ అని తన పోస్ట్ లో ప్రశంసించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైనాకు ట్రంప్ బిగ్ షాక్.. అదనంగా 100 శాతం సుంకాలు
3 రోజుల్లో 3 వేల నుంచి 3.5 లక్షలకు !! దూసుకెళ్తున్న అరట్టై యాప్
మాటకు.. మాట !! టాలీవుడ్‌లో కొత్త కాంట్రవర్సీ
కాంతారకు రూ.కోట్లలో కలెక్షన్స్ సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు
మొన్న విజయ్..నేడు రష్మిక..ఎంగేజ్మెంట్ రింగ్స్‌తో లవ్ బర్డ్స్
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

