చైనాకు ట్రంప్ బిగ్ షాక్.. అదనంగా 100 శాతం సుంకాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్టేషన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. 7 యుద్ధాలను ఆపిన తనకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు కానీ నిరాశే ఎదురైంది. దీంతో శుక్రవారం చైనాకు షాకిచ్చారు. చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం సుంకాలు విధించారు. ఈ టారిఫ్‌లు నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. దీంతో చైనా అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. భారీ సుంకాలు విధిస్తానంటూ హెచ్చరికలు చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీని రద్దు చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగారు. ఇది జరిగిన కొన్ని గంటలకే ట్రంప్ సుంకాల ప్రకటన చేసారు. గతంలోనూ అమెరికా- చైనా మధ్య వాణిజ్యయుద్ధం నడిచింది. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరిగిన వాణిజ్య సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. ట్రేడ్ డీల్‌కు ఇరుదేశాలు అంగీకరించినప్పటికీ.. అది ఓ కొలిక్కి రాలేదు. క్రిటికల్ సాఫ్ట్‌వేర్‌ను ఇతర దేశాలతో పంచుకోవడంపై నియంత్రణ విధిస్తున్నట్లు కూడా ట్రంప్ తెలిపారు. అమెరికా తయారుచేసే దాదాపు ప్రతి ఉత్పత్తి పైనా భారీగా ఎగుమతి ఆంక్షలు విధించాలని చైనా యోచిస్తోందనే నివేదికల ఆధారంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
3 రోజుల్లో 3 వేల నుంచి 3.5 లక్షలకు !! దూసుకెళ్తున్న అరట్టై యాప్
మాటకు.. మాట !! టాలీవుడ్‌లో కొత్త కాంట్రవర్సీ
కాంతారకు రూ.కోట్లలో కలెక్షన్స్ సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు
మొన్న విజయ్..నేడు రష్మిక..ఎంగేజ్మెంట్ రింగ్స్‌తో లవ్ బర్డ్స్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

